Breaking News

స్టార్ కొరియోగ్రాఫర్.. సైకో పాత్రలతో కేరాఫ్.. ఇతడెవరో తెలుసా?

Published on Sun, 09/14/2025 - 21:05

సాధారణంగా కొరియోగ్రాఫర్స్ అనగానే దాదాపు తెర వెనకే ఉంటారు. అప్పుడప్పుడు మాత్రమే తెరపై కనిపిస్తుంటారు. కానీ ఇతడు మాత్రం ఓవైపు స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూనే మరోవైపు సైకో విలన్‌గా తెగ భయపెడుతున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రీసెంట్ టైంలో వచ్చిన సినిమాల్లో సైకో పాత్రలతో క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. ఇంతకీ ఎవరితడు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

శాండీ మాస్టర్ అలియాస్ సంతోష్ కుమార్.. తమిళ ఇండస్ట్రీకి చెందిన కొరియోగ్రాఫర్ కమ్ నటుడు. చెన్నైకి చెందిన ఇతడు.. 2005లో డ్యాన్స్ మాస్టర్‌గా కెరీర్ ప్రారంభించాడు. తెలుగులోనూ ఓంకార్ హోస్ట్ చేసిన ఛాలెంజ్ షోలో కొరియోగ్రాఫర్‌గా చేశాడు. రీసెంట్ టైంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'మోనికా' పాటకు ఇతడే స్టెప్పులు కంపోజ్ చేశాడు. అంతకు ముందు విక్రమ్, థగ్ లైఫ్, ఆవేశం, తంగలాన్ తదితర సినిమాలకు పనిచేశాడు.

(ఇదీ చదవండి: 'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?)

ఇక నటన విషయానికొస్తే.. లోకేశ్ కనగరాజ్ 'లియో' సినిమా ప్రారంభంలో చాక్‌లెట్ కాఫీ అంటూ నవ్వుతూనే భయపెట్టి సైకో విలన్‌గా చేసింది ఇతడే. ఈ మూవీతో చాలా క్రేజ్ వచ్చింది. అలా రీసెంట్ మలయాళ హిట్ 'లోక: ఛాప్టర్ 1'లోనూ నాచియప్ప అనే ప్రతినాయక పాత్ర చేశాడు. తాజాగా రిలీజైన తెలుగు మూవీ 'కిష్కింధపురి'లోనూ విస్త్రవ పుత్ర అనే సైకో పాత్ర చేశాడు. రీసెంట్ టైంలో ఇలా వరసగా సైకో పాత్రలే చేస్తున్నాడు గానీ ప్రతిసారి తన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు.

ప్రస్తుతం శాండీ మాస్టర్ మలయాళ సినిమాలైన 'కథనార్', 'బాబాబా'ల్లో లీడ్ రోల్స్ చేస్తుండటం విశేషం. ఇలా ఓవైపు కొరియోగ్రాఫీ చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. మరోవైపు విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని భయపెడుతూ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు. శాండీ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. తమిళ నటి కాజల్ పశుపతిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. కానీ మూడేళ్లకే వీళ్లు విడాకులు తీసుకున్నారు. తర్వాత 2017లో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ దొరతి స‍్లవియాని వివాహం చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు. 

(ఇదీ చదవండి: 'మిరాయ్'తో తేజ సజ్జా ఇండస్ట్రీ రికార్డ్)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)