Breaking News

ఒకే ఒక పెద్ద సినిమా.. టాలీవుడ్‌కి ఏమైంది?

Published on Thu, 07/03/2025 - 14:12

టాలీవుడ్‌లో మొన్నటి వరకు పోటీ లేకుండా సినిమా రిలీజ్‌ అయ్యేది కాదు. ఒకేవారం పెద్ద సినిమాతో పాటు మూడు, నాలుగు చిన్న చిత్రాలు కూడా రీలీజ్‌ అయ్యేవి. కానీ సమ్మర్‌ నుంచి టాలీవుడ్‌లో పెద్దగా పోటీ లేకుండా సినిమాలు వస్తున్నాయి. ఇక గత నెలలో థగ్‌లైఫ్‌, కుబేర, కన్నప్ప లాంటి పెద్ద సినిమాలు వచ్చినా.. వాటి మధ్యలో కూడా వారం, వారం గ్యాప్‌ ఉంది. వీటితో పాటు రెండు, మూడు చిన్న సినిమాలు కూడా వచ్చాయి. కానీ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాయి. ఇక జులైలో టాలీవుడ్‌ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నెల మొత్తంలో ఒకే ఒక పెద్ద సినిమా రిలీజ్‌ కానుంది. మిగిలిన సినిమాలన్ని పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగబోతున్నాయి.

జులై మొదటి వారంలో తమ్ముడు చిత్రంలో నితిన్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ హీరోయిన్లుగా నటించగా, లయ కీలక పాత్ర పోషించింది. దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రంపై మోస్తరు అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాల మేరకు అయినా సినిమా ఆడుతుందో లేదో జులై 4న తెలుస్తుంది. ఇక అదే రోజు సిద్ధార్థ్‌ నటించిన 3 బి.హెచ్‌.కె కూడా విడుదల కానుంది. తమ్ముడుతో పోలిస్తే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు అయితే లేవు. హిట్‌ టాక్‌ వస్తే తప్ప థియేటర్‌కి వెళ్లి చూసే పరిస్థితి అయితే ఈ సినిమాకు లేదు.

ఇక రెండో వారంలో అనుష్క షూటీ రిలీజ్‌ కావాల్సింది. కానీ అది వాయిదా పడింది. దీంతో ఈ వారంలో ఎలాంటి పోటీ లేకుండా సింగిల్‌గా బరిలోకి దిగుతున్నాడు సుహాస్‌. ఆయన హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామ జులై 11న రిలీజ్‌ కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమాపై బజ్‌ క్రియేట్‌ చేసింది. మరి సింగిల్‌గా వస్తున్న సుహాస్‌.. సూపర్‌ హిట్‌ కొడతాడో లేదో చూడాలి.

ఇక మూడో వారంలో మేఘాలు చెప్పిన ప్రేమ కథ(జులై 17) అనే చిన్న సినిమాతో పాటు జూనియర్‌(జులై 18 అనే కన్నడ-తెలుగు సినిమా కూడా ఇక్కడ విడుదల కాబోతుంది. గాలి జనార్థన్‌రెడ్డి కొడుకు కిరీటీ హీరోగా నటిస్తున్న జూనియర్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించడం, హీరోయిన్‌గా శ్రీలీల నటించడం, మరో కీలక పాత్రలో జెనీలియా కనిపించడంతో జూనియర్‌పై టాలీవుడ్‌లో మంచి హైప్‌ క్రియేట్‌ అయింది.

ఇక చివరి వారంలో (జూలై 24) హరిహరి వీరమల్లు రాబోతుంది. ఈ నెలలో వస్తున్న ఏకైక పెద్ద సినిమా ఇదే. పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఎంఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పీరియాడికల్‌ డ్రామాలో నిధి అగర్వాల హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఈ సినిమాపై అంచనాలను పెంచేసిది.  

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)