Breaking News

బాక్సాఫీస్ వద్ద కుబేర.. వరల్డ్‌ వైడ్‌గా ఏకంగా 9వ స్థానం!

Published on Mon, 06/23/2025 - 17:51

ధనుశ్, నాగార్జున కీలక పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా రాణిస్తోంది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తందా మూడు రోజుల్లోనే రూ.87 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ వసూళ్లతో ఈ వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది. హాలీవుడ్‌ హీరో డకోటా జాన్సన్ నటించిన మెటీరియలిస్ట్స్‌ మూవీని అధిగమించింది. 

ఇండియా వ్యాప్తంగా చూస్తే మూడు రోజుల్లో కుబేర మూవీ రూ.48.60 కోట్ల నికర వసూళ్లను సాధించింది.  దేశవ్యాప్తంగా రూ. 57 గ్రాస్‌ కోట్ల వసూళ్లు రాబట్టింది.  ఓవర్‌సీస్‌లో రూ.23 కోట్లకు పైగా వసూళ్లు రాగా.. ఓవరాల్‌గా రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే నాగ చైతన్య చిత్రం తండేల్ రూ.88.25 కోట్ల వసూళ్లను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్‌ నటుడు జిమ్ సర్భ్ ప్రధాన పాత్ర పోషించారు.

మరోవైపు అదే రోజు విడుదలైన ఆమిర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ సినిమా రూ.88 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమాలపరంగా చూస్తే హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్, 28 ఇయర్స్ లేటర్, ఎలియో వంటి చిత్రాలు ఈ జాబితాలో ముందంజలో ఉన్నాయి. బాలేరినా మూవీ సితారే జమీన్ పర్‌కు కాస్తా దగ్గరగా ఉంది.
 

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)