Breaking News

ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన

Published on Fri, 07/11/2025 - 12:39

రీసెంట్ టైంలో థియేటర్లలోకి వచ్చిన హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ 'కుబేర'. ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. యునానిమస్‌గా ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోంది. అయితేనేం ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై ఉండగానే డిజిటల్ తెరపైకి వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: విశాఖలో 'అల్లు అర్జున్‌' మల్టీఫ్లెక్స్‌ పనులకు శ్రీకారం)

విడుదలకు ముందు 'కుబేర' ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయి. అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది. 4 వారాల అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇప్పుడు నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.  థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఓటీటీలో మిస్ కావొద్దు.

'కుబేర' విషయానికొస్తే.. దీపక్ (నాగార్జున) సీబీఐ ఆఫీసర్. అక్రమ కేసు కారణంగా జైలులో ఉంటాడు. దేశంలో సంపన్నుడైన నీరజ్ మిత్రా(జిమ్ షర్బ్) ఇతడిని బయటకు తీసుకొస్తాడు. ఓ ఆయిల్ డీల్ విషయమై లక్ష కోట్ల రూపాయలని ప్రభుత్వంలో పెద్దలకు ఇవ్వడంలో భాగంగా దీపక్‌ని వాడుకోవాలనేది నీరజ్ ప్లాన్. 

ఈ క్రమంలోనే దేవా (ధనుష్)తో పాటు మరో ముగ్గురు అనాథల పేరుపై బినామీ కంపెనీలు సృష్టిస్తాడు దీపక్. వాళ్ల అకౌంట్స్ నుంచి ప్రభుత్వ పెద్దలకు డబ్బులు చేరవేయాలనేది ఆలోచన. అయితే... దీపక్, నీరజ్ మిత్రా గ్యాంగ్ నుంచి దేవా తప్పించుకుంటాడు. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్న నీరజ్ మిత్రాని ఓ బిచ్చగాడు ఎన్ని ఇబ్బందులకు పెట్టాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: సినిమా టికెట్‌ లాటరీ.. ఐఫోన్ గెలుచుకున్న యువకుడు)

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)