Breaking News

హోటల్‌ గదిలో నాకు దెయ్యం కనిపించింది: కృతి శెట్టి

Published on Sun, 12/07/2025 - 19:04

సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు చెప్పే విషయాలు నమ్మాలా వద్దా అనే సందేహాలు రేకెత్తిస్తుంటాయి. 'ఉ‍ప్పెన' సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కృతిశెట్టి.. కొన్నాళ్ల క్రితం తనకు జరిగిన వింత అనుభవం గురించి బయటపెట్టింది. తల్లితో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు ఓ ఆత్మ లాంటి రూపం కనిపించిందని చెప్పుకొచ్చింది. తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని కూడా బయటపెట్టింది.

'కార్తీ వా వాతియర్ (అన్నగారు వస్తారు) షూటింగ్ మొదలవడానికి ముందు రోజు రాత్రి నాకో వింత అనుభవం ఎదురైంది. మా అమ్మతో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు ఓ ఆత్మని చూశాను. మేం లైట్ వేయగానే పెద్ద శబ్దం వచ్చింది. తర్వాత ఆత్మ కనిపించలేదు. మరి అది నాకు సాయం చేయడానికి వచ్చిందో లేదంటే నేను చేస్తున్న ప్రాక్టీస్ వల్ల వచ్చిందో తెలియదు. నాకు మొదటి నుంచి ఆత్మలపై నమ్మకముంది. ఎందుకంటే నేను తుళు జాతికి చెందిన అమ్మాయిని. మా పూర్వీకులని దేవతలుగా పూజిస్తాం. వాళ్లు ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతుంటారని నమ్ముతుంటాం. ఈ సంఘటన వల్ల ఆ నమ్మకం మరింత బలపడింది' అని కృతి శెట్టి చెప్పింది.

(ఇదీ చదవండి: ఈ పాపని గుర్తుపట్టారా? తండ్రి స్టార్ హీరో.. తల్లి, అక్క హీరోయిన్సే)

కార్తీ హీరోగా ఈమె నటించిన లేటెస్ట్ తమిళ మూవీ 'వా వాతియర్'. దీన్ని తెలుగులో 'అన్నగారు వస్తారు' పేరుతో ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో కార్తీ.. పోలీసుగా చేస్తుండగా, కృతిశెట్టి.. ఆత్మలతే మాట్లాడే జిప్సీ తరహా పాత్రలో కనిపించనుంది. అయితే కృతి చెప్పింది చూస్తుంటే ఇదేదో ప్రమోషన్ కోసం చెప్పినట్లు అనిపిస్తుంది. మరి నిజంగా ఈమెకు ఆత్మ కనబడిందో లేదంటే కల్పించి చెబుతోందా?

కృతి కెరీర్ విషయానికొస్తే.. 'ఉప్పెన'తో సూపర్ హిట్ అందుకుంది. కానీ తర్వాత తెలుగులో చేసిన దాదాపు సినిమాలన్నీ ఫెయిల్. దీంతో తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. కానీ కోలీవుడ్‌లో కూడా ఈమె చేసిన చిత్రాలు పలు కారణాల వల్ల ఆలస్యమైపోయాయి. ఈ మూవీ కూడా రెండు మూడేళ్ల పాటు సెట్స్‌పై ఉండి, ఇప్పుడు థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా)

Videos

Chintada Ravi: దేశ ప్రతిష్టను పాతాళానికి తొక్కేసాడు ఇండిగో సంక్షోభంపై రామ్మోహన్ నాయుడును ఏకిపారేసిన చింతాడ రవి

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జానియర్ ఎన్టీఆర్

Maoist Leader: మావోలకు భారీ ఎదురుదెబ్బ 3 కోట్లు రివార్డ్ ఉన్న మావోయిస్ట్ సరెండర్

ప్రజలకు వివరించి కోటి సంతకాల సేకరణ చేశాం: బొత్స సత్యనారాయణ

ఛీ.. ఛీ.. మీరు రాష్ట్రానికి పట్టిన. రామ్మోహన్ నాయుడు, లోకేష్‌పై రెచ్చిపోయిన KA పాల్

Kethireddy Pedda Reddy: అంతా మీ ఇష్టమా! తాడిపత్రి మీ అడ్డా కాదు

ఇండియాలో స్టార్ లింక్ సబ్ స్క్రిప్షన్ ధరలు ఇవే!

వెంటనే ఆపేయండి.. మెడికల్ కాలేజీల జోలికి పోవద్దు

Tadepalli : పోలీసుల ఓవర్ యాక్షన్ విద్యార్థి నేతలను లారీ ఎక్కించి..!

Machilipatnam: కూటమి నాయకుల మధ్య వాజ్‌పేయి విగ్రహం చిచ్చు

Photos

+5

చేతి వేళ్లన్నంటికీ రింగ్స్.. మృణాల్ ఠాకుర్ ఫ్యాషన్ (ఫొటోలు)

+5

సూర్య కొత్త సినిమా లాంచ్.. హీరోయిన్‌గా నజ్రియా (ఫొటోలు)

+5

అట్టహాసంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం (చిత్రాలు)

+5

Chiranjeevi : మేనేజర్ కుమార్తె బారసాల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు (ఫొటోలు)

+5

నేటి తరానికి స్పూర్తి.. మన 'ప్రగతి' విజయం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఈ కాళీ మాత ఆలయాన్ని మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

మడత మంచంపై పడుకుని ప్రకృతిని ఆస్వాదిస్తూ (ఫొటోలు)

+5

థాయ్‌ల్యాండ్ ట్రిప్‌లో 'రాజాసాబ్' బ్యూటీ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ రమ్య మోక్ష లేటేస్ట్ లుక్స్.. ఫోటోలు