Breaking News

'రవితేజ మూవీ నా తమ్ముడికి టర్నింగ్‌ పాయింట్'.. కోలీవుడ్ హీరో సూర్య

Published on Tue, 10/28/2025 - 22:15

మాస్ మహారాజా రవితేజ మరో ఫుల్‌ యాక్షన్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన నటించిన మాస్ జాతర ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా.. రవితేజ యాక్షన్‌, డైలాగ్‌ మాస్ ఆడియన్స్‌ను అలరిస్తున్నాయి. ఈ మూవీని భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కించారు. ధమాకా లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత శ్రీలీల మరోసారి రవితేజ సరసన కనిపించనుంది. ఈ మూవీ కోసం మాస్‌ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు.

రిలీజ్‌కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈవెంట్‌లో పాల్గొన్న హీరోయిన్‌ శ్రీలీల తన డ్యాన్స్‌తో మరోసారి ఆడియన్స్‌ను అలరించింది. రవితేజతో కలిపి స్టెప్పులతో అదరగొట్టేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు.

హీరో సూర్య మాట్లాడుతూ..' రవితేజకు నేను కూడా అభిమానినే. ఇది నాకు ఫ్యాన్‌ భాయ్‌ మూమెంట్. ఆయన ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవితేజ నటనకు బిగ్ ఫ్యాన్‌ నేను. తమిళంలోనూ రవితేజ సినిమాలకు అద్భుతమైన క్రేజ్‌ ఉంది. విక్రమార్కుడు మూవీ కార్తీ కెరీర్‌లో బిగ్ టర్నింగ్‌ పాయింట్. ఈ మాస్‌ జాతర సూపర్‌ హిట్‌ కావాలని కోరుకుంటున్నా. ఈ మూవీలో నటించిన అందరికీ ఆల్ ది బెస్ట్‌. డైరెక్టర్‌ భాను ‍కల నిజం కావాలి. ఈనెల 31 మరో బ్లాక్‌ బస్టర్‌ చూడబోతున్నాం' అని అన్నారు. కాగా.. రవితేజ, శ్రీలీల జంటగా వస్తోన్న మాస్ జాతర అక్టోబర్‌ 31 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

 

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)