Breaking News

బాగా చూసుకుంటా.. కిరణ్ అబ్బవరం గురించి భార్య పోస్ట్

Published on Fri, 08/22/2025 - 12:11

టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం 'కె ర్యాంప్', 'చెన్నై లవ్ స్టోరీ' అనే సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్‌గానే తండ్రిగానూ ప్రమోషన్ పొందాడు. గతేడాది ఆగస్టులో పెళ్లి జరగ్గా.. ఏడాదిలోనే తండ్రి అయిపోయాడు. ఈ క్రమంలోనే పెళ్లిరోజు రావడంతో భార్యకు విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టాడు. అలానే కిరణ్ భార్య రహస్య కూడా పోస్ట్ పెట్టింది. కానీ పెళ్లి నాటి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.

(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ)

కిరణ్-రహస్య ప్రేమ వివాహాం చేసుకున్నారు. 'రాజావారు రాణిగారు' సినిమాతో వీళ్లిద్దరూ టాలీవుడ్‌కి పరిచమయ్యారు. తర్వాత కిరణ్ వరస చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకోగా.. రహస్య మాత్రం నటన పక్కనబెట్టేసి ఉద్యోగం చేసుకుంది. స్నేహితులుగా మొదలైన వీళ్ల పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో గతేడాది ఆగస్టు 22న పెళ్లి చేసుకున్నారు.

ఈ క్రమంలోనే తొలి పెళ్లిరోజు సందర్భంగా కిరణ్ భార్య రహస్య పోస్ట్ పెట్టింది. 'పెళ్లికి సరిగ్గా గంటముందు నాకు చాలా ఆందోళనగా ఉంది. నా గుండె గట్టిగా కొట్టుకుంటోంది. అప్పుడు నా దగ్గరికి వచ్చిన కిరణ్ ఈ నోట్ ఇచ్చాడు. దీంతో ప్రశాంతంగా ధైర్యంగా అనిపించింది. ఏం జరిగినా సరే ఇతడు చూసుకుంటాడులే అనిపించింది. ఇదే నాకు దక్కిన బెస్ట్ గిఫ్ట్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కిరణ్ అబ్బవరం' అని రహస్య రాసుకొచ్చింది. ఈమె షేర్ చేసిన ఫొటోలు.. కిరణ్ 'నన్ను భర్తగా కోరుకున్నందుకు థ్యాంక్యూ. నా జీవితంలోకి స్వాగతం. బాగా చూసుకుంటా' అని రాసిచ్చిన నోట్ చూడొచ్చు.

(ఇదీ చదవండి: మంచు విష్ణు డేర్‌.. రూ. 100 కోట్ల పెట్టుబడితో బిగ్‌ ప్లాన్‌)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)