Breaking News

అతను కన్నీళ్లు పెట్టుకోవడం అదే మొదటిసారి: కీర్తి సురేశ్

Published on Wed, 01/28/2026 - 20:46

హీరోయిన్ కీర్తి సురేశ్ ఇటీవలే రివాల్వర్ రీటాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. లేడీ ఓరియంటేడ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రంగా తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రస్తుతం కీర్తి సురేశ్ తోట్టం అనే మూవీలో కనిపించనుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కీర్తి సురేశ్.. తన ప్రేమ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. పెళ్లి రోజు తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్‌ భావోద్వేగానికి గురయ్యాడని వెల్లడించింది. 15 ఏళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకోవడంతో తాను మరింత ఎమోషనల్ అయ్యాడని తెలిపింది. ఆంటోనీ కన్నీళ్లు పెట్టుకోవడం తాను చూడటం మొదటిసారని అన్నారు.

కీర్తి సురేశ్ మాట్లాడుతూ..'మేము ఇలాంటి పెళ్లి గురించి కలలో కూడా ఊహించలేదు, ఎందుకంటే మేము పారిపోయి పెళ్లి చేసుకుందామని  అక్షరాలా అనుకున్నాం. కానీ ఇలాంటి పెళ్లిని ఎప్పుడూ ఊహించలేదు. అది నిజం కావడంతో మాకు మాటలు రాని స్థితిలో ఉండిపోయాం. ఈ క్షణం కోసం 15 ఏళ్లుగా ఎదురుచూశాం. ఇదంతా కేవలం 30 సెకన్లలోనే ముగిసింది. నేను పూర్తిగా శూన్యంలోకి వెళ్లిపోయాను. ఆ సమయంలో నాకు తాళి తప్ప అన్నీ శూన్యంగా అనిపించాయి. అది చాలా భావోద్వేగభరితమైన క్షణం. బహుశా అతను కన్నీళ్లు పెట్టుకోవడం కూడా నేను చూడటం అదే మొదటిసారి. ఇది ఒక అందమైన ప్రయాణం' అంటూ చెప్పుకొచ్చింది.

కీర్తి సురేష్- ఆంటోనీ తట్టిల్ ప్రేమకథ..

కాగా.. కీర్తి సురేశ్ సినీ పరిశ్రమలోకి ప్రవేశించడానికి ముందే ఆంటోనీ తట్టిల్ ప్రేమలో ఉంది.  చిన్ననాటి స్నేహితుడైన 15 ఏళ్ల సుదీర్ఘ ప్రేమాయణం నడిచింది. ఈ జంట డిసెంబర్ 12, 2024న గోవాలో వివాహం చేసుకున్నారు.  మొదట సాంప్రదాయ హిందూ వివాహం.. ఆ తర్వాత మలయాళీ క్రైస్తవ పద్ధతిలో ఒక్కటయ్యారు.

 

Videos

Vijayawada : చెవిరెడ్డి రిలీజ్.. జైలు వద్ద YSRCP సంబరాలు

SIT విచారణకు గడువు కోరే యోచనలో KCR

ఒక్క ఏడాది ఓపిక పట్టండి..! సీక్వెల్స్ తో దద్దరిల్లిపోద్ది

రేవంత్ కుట్ర రాజకీయాలు!! హరీష్ రావు ఫైర్

పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్

మీ కుట్రలకు అంతు లేదా !! బాబు, పవన్ పై లక్ష్మీ పార్వతి ఫైర్

100 మంది 10 నిమిషాల్లో. కడపలో TDP చేసిన విధ్వంసం

Gadikota: రగులుతున్న ఆంధ్రా.. నీకు దమ్ముంటే

YSRCP Leaders : పై వాడే చూసుకుంటాడు.. త్వరలో లెక్క క్లియర్ చేస్తాడు

నా పార్టీ ఏంటో చూపిస్తా అన్నావ్ ఇప్పుడు ఏం అంటావ్ పవన్

Photos

+5

రంగస్థలం బ్యూటీ పూజిత పొన్నాడ లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ సావిత్రి బేబీ బంప్‌ స్టిల్స్ (ఫొటోలు)

+5

మేడారం మహా సంబరం.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

కుమారులతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో హీరో ధనుశ్ (ఫొటోలు)

+5

అందాల రాశి... మానస వారణాశి... లేటెస్ట్ ఫోటోలు చూశారా?

+5

బేగంపేట్‌ : అట్టహాసంగా వింగ్స్‌ ఇండియా– 2026 ప్రారంభం (ఫొటోలు)

+5

వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణం (ఫొటోలు)

+5

ఆదివాసీ ఆచారాలతో సారలమ్మకు స్వాగతం.. మేడారంలో కిక్కిరిసిన భక్తులు (ఫొటోలు)

+5

'హే భగవాన్' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

ఫుల్ గ్లామరస్‌గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.. ఫోటోలు