Breaking News

బిగ్ బాస్‌ కంటెస్టెంట్‌కు బిగ్‌ షాక్.. షో మధ్యలోనే అరెస్ట్!

Published on Mon, 10/23/2023 - 13:39

బిగ్‌ బాస్‌ రియాలిటీ షో టాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో సినీ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ సీజన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. కన్నడలో కిచ్చా సుదీప్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. తమిళంలో స్టార్ హీరో కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నారు. 

అయితే ఇప్పటివరకు ఆసక్తికరంగా సాగుతున్న కన్నడ బిగ్‌బాస్‌ షోలో ఊహించని సంఘటన ఎదురైంది. ప్రస్తుతం కన్నడ బిగ్ బాస్ సీజన్- 10 కంటెస్టెంట్ వర్తుర్ సంతోష్‌ను అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ షోలో పాల్గొన్న సంతోష్ పులి పంజా ఉన్న లాకెట్‌ను ధరించి కనిపించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన అటవీశాఖ అధికారులు బిగ్ బాస్ సెట్స్‌కు చేరుకుని లాకెట్‌ను పరిశీలించారు. 

(ఇది చదవండి: ప్రభాస్ పుట్టినరోజు.. కన్నప్ప చిత్రబృందం స్పెషల్ పోస్టర్!)

లాకెట్‌ను పరిశీలించిన అనంతరం.. అది అసలైన పులిదేనని అని నిర్ధారణకు వచ్చారు. దీంతో అటవీశాఖ అధికారులు వర్తూర్ సంతోష్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరిన్నీ వివరాలు రాబట్టేందుకు లాకెట్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. ఈ విషయంపై డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972ని అతను ఉల్లంఘించారని.. నేరం రుజువైతే మూడు నుంచి ఏడేళ్ల శిక్ష పడుతుందని తెలిపారు. 

కాగా.. వర్తూరు సంతోష్ కర్ణాటకలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అఖిల భారత గోసంరక్షణ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత ఫేమస్ అయ్యారు. అక్టోబర్ 8న 2023న బిగ్ బాస్ కన్నడ సీజన్‌- 10 హౌస్‌లో అడుగుపెట్టారు. 

(ఇది చదవండి: రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరో మేనల్లుడు.. దాదాపు 8 ఏళ్ల తర్వాత!)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)