Breaking News

ఎంతవారైనా సరే వదిలే ప్రసక్తే లేదు.. కంగనా స్ట్రాంగ్ వార్నింగ్

Published on Mon, 02/06/2023 - 19:10

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తనపై గూఢచర్యం జరుగుతోందని ఆరోపించింది.  ఎప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ నటి తనను ఎవరో టార్గెట్ చేశారని చెబుతోంది. అంతే కాకుండా పరోక్షంగా రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌ను ఉద్దేశించి చేసినట్లు  నెటిజన్లు కామెంట్స్ చేశారు. నా ప్రతి కదలికను వారు గమనిస్తున్నారని పేర్కొంది. అయితే ఆమె ఈ ప్రకటన చేసిన ఒక్కరోజులోనే తనను ఫాలో చేస‍్తున్నవారు వెనక్కి తగ్గారని వివరించింది. ప్రస్తుతం తనపై నిఘా విరమించుకున్నారని తెలిపింది. 

ఈ సందర్భంగా తనపై గూఢచర్యం చేస్తున్నారని ఆరోపించిన చాంగు మంగు 'ఫిల్మ్ మాఫియా'కు కంగనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? ఇంట్లోకి దూరి మరీ కొడతా అంటూ ఓ రేంజ్‌లో హెచ్చరించింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. 'మై పాగల్ హు, ఘర్ మే ఘుస్ కే మారుంగి' అంటూ హిందీలో రాసుకొచ్చింది.  గూఢచర్యంపై ప్రకటన చేసిన ఒక రోజులోనే తన చుట్టూ ప్రస్తుతం ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరగడం లేదని తన అనుచరులకు తెలిపింది.

తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాస్తూ.. 'నా గురించి ఆందోళన చెందుతున్న వారందరికీ దయచేసి నా హెచ్చరిక. గత రాత్రి నుంచి నా చుట్టూ ఎటువంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరగలేదు. కెమెరాలతో ఎవరూ నన్ను అనుసరించలేదు. ఆ చాంగు మంగు గ్యాంగ్‌కు నేను ఒకటే చెబుతున్నా. నేను పిచ్చిదాన్ని అని మీరు అనుకుంటే పొరపాటు. ఇందులో ఎంత పెద్దవారైనా సరే వదిలే ప్రసక్తే లేదు. ఇంట్లోకి దూరి మరీ కొడతా.' అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది కంగనా రనౌత్. 

కాగా.. కంగనా తదుపరి ఎమర్జెన్సీ చిత్రంలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. రజనీకాంత్ తమిళ చిత్రానికి సీక్వెల్  'చంద్రముఖి 2'లో కూడా తాను నటిస్తానని కంగనా ప్రకటించింది.ఆ తర్వాత 'తేజస్'లో కనిపించనుంది, ఇందులో ఆమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రను పోషించనుంది. ఈ చిత్రం అధికారిక విడుదల తేదీ త్వరలోనే ప్రకటించనున్నారు. 


 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)