Breaking News

కల్కి సీక్వెల్‌లో హీరోయిన్‌గా ఛాన్స్‌! కల్యాణి ఏమందంటే?

Published on Thu, 11/06/2025 - 15:17

గతేడాది బాక్సాఫీస్‌ వద్ద మ్యాజిక్‌ చేసిన చిత్రాల్లో కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD Movie) ఒకటి. ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు. నాగ్‌ అశ్విన్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ వెయ్యి కోట్లపైనే వసూలు చేసి బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రెండో పార్ట్‌ ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.

దీపికా స్థానంలో కల్యాణి?
ఇలాంటి సమయంలో కల్కి సీక్వెల్‌ నుంచి దీపికా(Deepika Padukone)ను తొలగిస్తున్నట్లు ప్రచారం జరిగింది. 8 గంటల పని, తన టీమ్‌ మెంబర్స్‌కు లగ్జరీ వసతులు, లాభాల్లో వాటా.. ఇలా కొన్ని భారీ షరతుల కారణంగా ఆమెను సైడ్‌ చేశారు. దీంతో దీపికా పాత్రలో ఎవరు నటించనున్నారంటూ సోషల్‌ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. దీపికా స్థానంలో ఆలియా భట్‌, సాయిపల్లవి, అనుష్కల పేర్లు వినిపించాయి. ఇటీవల కొత్త లోక: చాప్టర్‌ 1తో సక్సెస్‌ అందుకున్న కల్యాణి ప్రియదర్శన్‌ (Kalyani Priyadarshan) పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.

అంతకన్నా సంతోషం ఇంకేముంది?
ఈ రూమర్‌పై కల్యాణి స్పందించింది. కొందరు ఇదేపనిగా యాక్టర్స్‌ గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారనుకుంటా.. ఏదేమైనా నా పేరు పరిశీలిస్తున్నారంటే నాకు సంతోషంగానే ఉంది. నన్ను ఎంపిక చేయాలని భావిస్తున్నారంటే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది? కానీ, వాళ్లు ఎవర్ని ఫైనల్‌ చేశారు? ఎవరిని తీసుకోబోతున్నారు? అన్నది చెప్పడం చాలా కష్టం. జనాలు నన్ను ఆ పాత్రలో చూడాలని కోరుకుంటున్నారంటేనే ఎంతో సంబంరంగా ఉంది. ఇలాంటి అనుభూతి ఇంతకుముందెన్నడూ కలగలేదు అని చెప్పుకొచ్చింది.

చదవండి: పెళ్లి సందడి షురూ.. జగద్ధాత్రి సీరియల్‌ నటి హల్దీ ఫంక్షన్‌

Videos

విద్యార్థినికి జనసేన నాయకుడు నారాయణరావు వేధింపులు

జూబ్లీహిల్స్ ఎన్నిక వేళ.. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు

Asifabad District: ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

దేశవ్యాప్తంగా 1,800 విమానాలు రద్దు

నిష్పక్షపాతంగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక సీఎం వైఎస్ జగన్

Tirupati District: భారీ వర్షంతో పొంగిన వాగు విద్యార్థుల అష్టకష్టాలు

విద్యుత్ ఉద్యోగిపై TDP నేత రంగారెడ్డి బూతులు

Tirupati: అంధకారంలో గ్రామాలు వరదలో కొట్టుకుపోయిన పశువులు

జగన్ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు చేయాల్సిందే

KSR Live Show: క్రెడిట్ దొంగ

Photos

+5

Kamal Haasan: బార్బర్‌ షాపులో పనిచేసి.. విశ్వనటుడిగా ఎదిగి.. (ఫోటోలు)

+5

చీరలో చందమామే.. అందరి చూపులు తనపైనే! (ఫోటోలు)

+5

'సంతాన ప్రాప్తిరస్తు' ట్రైలర్‌ ఈవెంట్‌లో సినీ ప్రముఖులు (ఫోటోలు)

+5

కాంత ట్రైలర్‌ లాంచ్‌.. ఒకే వేదికపై దుల్కర్‌, రానా (ఫోటోలు)

+5

ఎన్నికల వేళ అరుదైన చిత్రాలు.. బిహార్‌ ఓటర్ల ప్రత్యేక (ఫొటోలు)

+5

#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విష్ణు విశాల్‌ ’ఆర్యన్‌‘ మూవీ ప్రీ రిలీజ్‌ (ఫొటోలు)

+5

ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)