Breaking News

అజయ్‌ నా లవ్‌ ఎట్ ఫస్ట్ సైట్ కాదు.. కాజోల్ షాకింగ్ కామెంట్స్

Published on Sun, 04/02/2023 - 14:01

కాజోల్‌.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే స్టార్‌ హీరోయిన్లలో ఒకరు. ఎలాంటి కష్టతరమైన పాత్రలోకి అవలీలగా పరకాయ ప్రవేశం చేసి తన నటనా పటిమను చాటుకున్న బ్యూటీఫుల్‌ హీరోయిన్‌ ఆమె. 17 ఏళ్ల వయసులో 1992లో విడుదలైన 'బేఖుడి' చిత్రంతో సినీ రంగానికి పరిచయమైంది బ్యూటీఫుల్‌ కాజోల్‌. కుచ్‌ కుచ్‌ హోతా హై, దిల్వాలే దుల్హానియే లేజాయింగే, ఫనా, బాజీగర్, దుష్మన్‌, త్రిభంగ, కరణ్‌ అర్జున్‌, మెరుపు కలలు, వీఐపీ 2 వంటి తదిర సినిమాలతో ఎంతో పేరు తెచ్చుకుంది.

కాగా.. 1999లో ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.  వారిద్దరికి నైసా, యుగ్‌ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. అజయ్‌, కాజోల్‌ కలిసి నటించిన 'తానాజీ' సినిమా 68వ జాతీయ చలన చిత్ర అవార్డులలో మూడు బహుమతులను గెలుపొందింది. అయితే గతంలో ఓ ఈవెంట్‌లో మాట్లాడిన కాజోల్ వారి ప్రేమ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అజయ్‌ను మొదటిసారి చూసినప్పుడు తనకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదని కాజోల్ తెలిపింది.  

కాజోల్ మాట్లాడూతూ..'నేను అతన్ని హల్‌ చల్‌ మూవీ సెట్స్‌లో కలిశాను. అది మా షూటింగ్‌లో మొదటి రోజు. నిర్మాత నా దగ్గరకు వచ్చి అక్కడున్న వ్యక్తి హీరో అని చెప్పాడు. అతను ఒక మూలకు కుర్చీలో కూర్చున్నాడు. నేను అతన్ని చూసి 'నిజమా? అతనేనా హీరో? అని ఆశ్చర్యం వ్యక్తం చేశా. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. అజయ్ ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడే వ్యక్తి అని గ్రహించా. ఆ తర్వాత మేం ఫ్రెండ్స్ అయ్యాం' అని అన్నారు. కాగా.. వీరిద్దరు నటించిన హల్‌చల్‌ 1995లో థియేటర్లలో విడుదలైంది.

కాగా.. అజయ్ దేవగన్ ప్రస్తుతం తన తాజా చిత్రం భోలా బాక్సాఫీస్ విజయంతో దూసుకుపోతున్నాడు. లోకేష్ కనగరాజ్ చిత్రం తమిళ హిట్ మూవీని కైతిని హిందీ రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి అజయ్ దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో అజయ్‌తో పాటు టబు, గజరాజ్ రావు, దీపక్ డోబ్రియాల్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)