Breaking News

న్యూ ఇయర్ వేళ.. శక్తిపీఠాలు సందర్శించిన సూర్య దంపతులు..!

Published on Sun, 04/20/2025 - 16:15

కోలీవుడ్ స్టార్ జంట జ్యోతిక- సూర్య దంపతులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న ఈ జంట.. ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. తాజాగా మహారాష్ట్ర కొల్లాపూర్‌లోని మహాలక్ష్మి, కామాఖ్య ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న ఈ జంట ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల తమిళ న్యూ ఇయర్ సందర్భంగా ఆలయానికి వెళ్లినట్లు జ్యోతిక పోస్ట్ చేసింది.

ఇక సినిమాల విషయానికొస్తే జ్యోతిక ఇటీవలే డబ్బా కార్టెల్‌ అనే వెబ్ సిరీస్‌తో అభిమానులను అలరించింది. సూర్య ప్రస్తుతం రెట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కార్తీక్ సుబ్బరాజ్‌ డైరెక్షన్‌లో వస్తోన్న  ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హేగ్డే హీరోయిన్‌గా నటించింది. ఇటీవలే రెట్రో ట్రైలర్‌ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కంగువా డిజాస్టర్‌ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

రెట్రో సెన్సార్ పూర్తి..

ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రానికి యూ/ ఏ సర్టిఫికేట్‌ పొందినట్లు మేకర్స్ వెల్లడించారు. రెట్రో సినిమా నిడివి(రన్‌టైమ్‌) దాదాపు రెండు గంటల 48 నిమిషాలుగా ఉండనుంది. కార్తీక్ సుబ్బరాజ్‌ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా అభిమాలను అలరించనుంది. ఈ చిత్రంలో కరుణాకరన్‌, జోజూజార్జ్‌, సుజిత్‌ శంకర్‌, నాజర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కార్మికుల దినోత్సవం సందర్భంగా మే డే రోజున తెరపైకి రానుంది. 
 

 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)