Breaking News

రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన 'జూనియర్'

Published on Tue, 09/30/2025 - 10:27

కొన్నిరోజుల క్రితం వైరల్ వయ్యారి అంటూ శ్రీలీల తెగ వైరల్ అయిపోయింది. 'జూనియర్' సినిమాలోనిది ఆ పాట. అయితే దాదాపు రెండున్నర నెలల క్రితం థియేటర్లలోకి మూవీ వచ్చింది. కానీ ఓటీటీ సంగతి మాత్రం పూర్తిగా సైలెంట్‪‌గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఒకేసారి రెండింటిలో స్ట్రీమింగ్ అయిపోయింది. ఇంతకీ ఈ మూవీ వేటిలో చూడొచ్చు.

గాలి జనార్ధన రెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయమైన చిత్రం 'జూనియర్'. కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ కాగా జెనీలియా కీలక పాత్రలో నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించాడు. థియేటర్లలో మోస్తరు టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు ముందే ప్రకటించినట్లు డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది.

(ఇదీ చదవండి: 1,050 సినిమాల పైరసీ.. రూ.22,400 కోట్ల నష్టం)

ముందే చెప్పినట్లు ఆహా ఓటీటీలోకి రాగా.. ఏ మాత్రం హడావుడి లేకుండా సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి కూడా వచ్చేసింది. ఈ రెండింటిలో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుండగా.. నమ్మ ఫ్లెక్స్ అనే ఓటీటీలో కన్నడ వెర్షన్ అందుబాటులో ఉంది.

'జూనియర్' విషయానికొస్తే.. అభి (కిరీటి) జ్ఞాపకాలే ముఖ్యమనుకునే కుర్రాడు. అలా జాలీగా ఇంజినీరింగ్ చేస్తాడు. కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమించిన స్పూర్తి(శ్రీలీల) పనిచేస్తున్న కంపెనీలోనే ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అయితే అదే కంపెనీకి బాస్ అయిన విజయ(జెనీలియా)కి అభి అస్సలు నచ్చడు. అయితే వీళ్లిద్దరికీ ఓ గతం ఉంటుంది. ఒకరంటే ఒకరిని పడని అభి-విజయ.. విజయనగరం అనే ఊరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. చివరకు ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ ఓజీకి బిగ్‌ షాక్..!)

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)