Breaking News

ఎన్టీఆర్ వార్-2.. బాక్సాఫీస్‌ నో క్రేజ్‌.. ఓటీటీలో సూపర్ రికార్డ్!

Published on Tue, 10/14/2025 - 16:41

యంగ్‌ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వార్-2((War2 Movie)). ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ మూవీలో హృతిక్ రోషన్‌ కూడా నటించారు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా.. యశ్‌ రాజ్ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా మెప్పించింది.

అయితే ప్రస్తుతం వార్-2 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబరు 09 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తాజాగా ఈ చిత్రం డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 12 వరకు ఇండియాలో అత్యధిక మంది వీక్షించిన సినిమాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. 3.5 మిలియన్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. ఈ క్రమంలోనే రజినీకాంత్ కూలీ, సన్ ఆఫ్ సర్దార్‌-2, మహావతార్ నర్సింహా, మదరాసి సినిమాలను దాటేసింది. ఈ విషయాన్ని ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేని వార్-2 చిత్రానికి డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లో మాత్రం ఆదరణ దక్కించుకుంటోంది. దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, అశుతోష్ రాణా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.300 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.
 

 

Videos

ఓరి దీని వేషాలో... దీనికి ఆస్కార్‌ పక్కా!

తూచ్.. మాకు సంబంధం లేదు.. ప్లేట్ మార్చిన చంద్రబాబు

నీ గెలుపుకోసం మమ్మల్ని వాడుకున్నావ్.. ఇప్పుడు ఏమైపోయావ్ పవన్

బొజ్జల 20 కోట్ల వ్యాఖ్యలపై వినుత కోట సంచలన ఆడియో

రన్నింగ్ ట్రైన్ లో మహిళపై అత్యాచారం

జోగి రమేష్ పై ఆరోపణలు.. సజ్జల స్ట్రాంగ్ రియాక్షన్

నా భార్య పిల్లలతో నీ ఇంటికి వస్తా.. నువ్వు, నీ కొడుకు సిద్ధమా..?

భారీ వర్ష్పాలు, తుఫానులతో ఈశాన్య రుతుపవనాలు వచ్చేస్తున్నాయి..

బీహార్ ఎన్నికల్లో పోటీకి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి

సాక్షి బ్యాన్.. TDPపై సుప్రీం సీరియస్

Photos

+5

దీపావళి ఈవెంట్‌లో సెలబ్రిటీలు.. ఇండస్ట్రీ అంతా ఒకేచోట (ఫొటోలు)

+5

దత్తత కూతురి బర్త్ డే సెలబ్రేషన్‌లో సన్నీ లియోన్ (ఫొటోలు)

+5

‘తెలుసు కదా’ సినిమా ప్రెస్‌ మీట్‌లో సిద్ధు జొన్నలగడ్డ (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ శారీ లుక్‌లో ‘కూలి​’ బ్యూటీ..

+5

సారా టెండుల్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

స్విట్జర్లాండ్‌ ట్రిప్‌లో 'కాంతార' బ్యూటీ (ఫొటోలు)

+5

కాంతార ‘కనకావతి’ శారీ లుక్‌ అదరహో! (ఫొటోలు)

+5

'థామ' ప్రమోషన్స్‌లో రష్మిక, మలైకా అరోరా స్టెప్పులు (ఫోటోలు)

+5

చాలారోజుల తర్వాత 'విష్ణు ప్రియ' గ్లామ్‌ షూట్‌ (ఫోటోలు)

+5

‘మిత్రమండలి’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)