Breaking News

ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published on Fri, 02/02/2024 - 14:47

పలు అవార్డులు గెలుచుకున‍్న సూపర్‌హిట్ థ్రిల్లర్ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. గత కొన్నాళ్ల నుంచి సినీ ప్రేమికులు ఈ చిత్రం తెగ ఎదురుచూస్తూ వచ్చారు. తెలుగు మూవీ కానప్పటికీ దీని కోసం వెయిట్ చేశారు. ఇప్పుడు వాళ్ల ఎదురుచూపులు ఫలించాయి. డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. కాకపోతే చిన్న కండీషన్. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో ఉంది? అనేది ఇప్పుడు చూద్దాం.

సినిమా సంగతేంటి?
బాలీవుడ్‌లో గతేడాది రిలీజైన విభిన్నమైన సినిమాల్లో 'జొరమ్' ఒకటి. ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా.. డిసెంబరు 8న థియేటర్లలో రిలీజైంది. కానీ అంతకంటే ముందే సిడ్నీ, డర్బన్, షికాగో, ఎడిన్‌బరో లాంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో దీన్ని ప్రదర్శించారు. అలానే బెస్ట్ యాక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ తదితర విభాగాల్లో అవార్డులు కూడా గెలుచుకుంది. ఈ మధ్య కాలంలో అయితే ఫిలింఫేర్-2024లో ఉత్తమ చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది.

(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా)

కథేంటి?
జార్ఖండ్ అడవుల్లో నివసించే దస్రు-వాను అనే గిరిజన జంటకు జొరమ్ అనే మూడు నెలల కూతురు ఉంటుంది. ఊళ్లో పనిలేక పొట్టచేత పట్టుకుని ముంబై వస్తారు. బిల్డింగ్ కట్టే చోట రోజూవారీ కూలీలుగా పనిచేస్తుంటారు. అయితే తన కొడుకుని దస్రు చంపేశాడని అతడిని పట్టుకునేందుకు ముంబై వస్తుంది. భార్య వానుని చంపేయడంతో మూడు నెలల కూతురితో కలిసి దస్రు పారిపోతాడు. పోలీసుల నుంచి దాక్కుని మరీ సొంతూరికి పయనమవుతాడు. మరి నెలల కూతురితో కలిసి దస్రు ఊరికి చేరుకున్నాడా? చివరకు ఏమైందనేదే స్టోరీ.

ఏ ఓటీటీలో?
ఆదివాసులకు ఉండే సమస్యలు, అడవులు విధ్వంసం లాంటి స్టోరీ లైన్‌తో తీసిన 'జొరమ్'.. దాదాపు రెండు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. హిందీలో ఉన్న ఈ చిత్రం ప్రస్తుతానికి అయితే రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. కాబట్టి ఈ వీకెండ్ సమ్‌థింగ్ డిఫరెంట్ ఉంటే సర్వైవల్ థ్రిల్లర్ చూద్దామనుకుంటే 'జొరమ్' ట్రై చేయొచ్చు. రియాలిటీకి దగ్గరగా ఉండే ఈ చిత్రం మరి ఓటీటీలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?)

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)