Breaking News

ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. తెలుగు సినిమాతోనే ఎంట్రీ!

Published on Sun, 08/13/2023 - 15:38

బాలీవుడ్‌లో ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ-2 సీజన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ రియాలిటీ షోకు హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే బిగ్ బాస్ ఓటీటీ- 2లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న జియా శంకర్ ఇటీవలే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే  రియాలిటీ షో నుంచి బయటకొచ్చేసిన జియాశంకర్‌ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కారు ముందు జియాశంకర్ కొబ్బరికాయ కొడుతూ కనిపించింది. 

(ఇది చదవండి: చిరు కొత్త సినిమా ప్రకటన.. సూపర్‌ హిట్‌ డైరెక్టర్‌కు ఛాన్స్‌)

అంతే కాకుండా జియా తన కొత్త కారు ముందు  పోజులిస్తూ ఉత్సాహంగా కనిపించింది. ఆ తర్వాత అక్కడున్న వారందరికీ స్వీట్లు కూడా పంచింది. జియా కొనుగోలు చేసిన కారు యస్‌యూవీ బీఎండబ్ల్యూ ఎక్స్5 మోడల్ కాగా.. ముంబయిలో ఈ మోడల్ కారు ధర దాదాపు రూ. 1.3 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం జియా బిగ్ బాస్ ఓటీటీ- 2లో పాల్గొనడంతో ప్రేక్షకుల్లో మరింత ఆదరణ తెచ్చుకుంది.  ఆమె ఈ రియాలిటీ షోలో టాప్-6 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచింది.  ఆమె 2013లో తెలుగు చిత్రం ఎంత అందంగా ఉన్నావే చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించింది.  రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా దేశ్‌ముఖ్‌లతో కలిసి మరాఠీ చిత్రం వేద్‌లో చివరిసారిగా జియా కనిపించింది. అంతే కాకుండా జియా లవ్ బై ఛాన్స్, ప్యార్ తునే క్యా కియా, మేరీ హనికరక్ బీవీ, కాటేలాల్ అండ్ సన్స్, లాల్ ఇష్క్, పిశాచిని,  గుడ్‌నైట్ ఇండియా వంటి అనేక ప్రముఖ టీవీ షోలలో కనిపించింది. 

(ఇది చదవండి: జైలర్‌ నటుడితో జత కట్టనున్న ఇద్దరు హీరోయిన్స్‌!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)