Breaking News

త్రిషకు అతనితో పెళ్లి చేయడమే పెద్ద మైనస్.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్

Published on Mon, 06/05/2023 - 11:23

పవన్‌కల్యాణ్‌, త్రిష జంటగా నటించిన ప్రేమకథా చిత్రం 'తీన్‌మార్‌'. అయితే అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో అభిమానులను మెప్పించలేకపోయింది. అయితే ఈ చిత్ర పరాజయంపై దాదాపు 12 ఏళ్ల తర్వాత డైరెక్టర్ జయంత్‌ సి.పరాన్జీ స్పందించారు.

తెలుగులో ప్రేమించుకుందాం రా, బావగారూ బాగున్నారా?, ప్రేమంటే ఇదేరా.. వంటి సూపర్‌హిట్  ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీ మూవీస్  ప్రేక్షకులకు అందించారు దర్శకుడు జయంత్‌ సి.పరాన్జీ. 2011లో విడుదలైన తీన్‌మార్‌ ఫ్లాప్ తర్వాత టాలీవుడ్‌కు దూరమయ్యారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయంత్ సినిమా ఫ్లాప్‌పై స్పందించారు. ‘తీన్‌మార్‌’ బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్‌ కావడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత)

జయంత్ సి పరాన్జీ మాట్లాడుతూ.. 'సినిమా ఫ్లాప్‌ సంగతి పక్కన పెడితే తీన్‌మార్‌ నాకిప్పటికీ ప్రెష్‌ లవ్‌ స్టోరీగానే అనిపిస్తుంది. ఈ చిత్రం ఫెయిల్‌ కావడానికి కారణాలు నేను చెప్పలేను. కానీ ఈ చిత్రంతో కొంత మంది ఫ్యాన్స్‌ నిరాశకు గురయ్యారు. మరీ ముఖ్యంగా త్రిషకు సోనూసూద్‌తో వివాహం చేయడం.. ఆ తర్వాత ఆమె తిరిగి పవన్‌కల్యాణ్‌ వద్దకు చేరడం లాంటి సీన్స్ ప్రేక్షకులకు నచ్చలేదు. ఇదే చిత్రాన్ని అప్పుడున్న యంగ్ హీరోతో చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో.' అని అన్నారు.

కాగా.. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ నటించిన లవ్‌ ఆజ్‌ కల్‌ మూవీకి రీమేక్‌గా తీన్‌మార్‌ తెరకెక్కించారు. పవన్‌కల్యాణ్‌, త్రిష, కృతి కర్బంద నటించిన ఈ చిత్రం  మ్యూజికల్‌గా హిట్ అయినా.. బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరిచింది. 

(ఇది చదవండి: కెరీర్‌ ఎందుకు నాశనం చేసుకుంటావ్? అని నా భార్య ప్రశ్నించింది: మనోజ్‌)

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)