Breaking News

ఓటీటీలో సైకో థ్రిల్లర్‌ మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే?

Published on Tue, 10/24/2023 - 12:15

థియేటర్‌లో అన్ని జానర్ల సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. అయితే ఓటీటీలో మాత్రం సస్పెన్స్‌, థ్రిల్లర్‌ కంటెంట్‌కే ఎక్కువగా ఓటేస్తున్నారు. ఓటీటీ ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ కూడా సరికొత్త సినిమాలు, సిరీస్‌లతో సినీప్రియులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ క్రైమ్‌ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

స్టార్‌ హీరో జయం రవి, నయనతార జంటగా నటించిన చిత్రం ఇరైవన్‌. అహ్మద్‌.. కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించగా సుధన్‌ సుందరం, జయరామ్‌.జి కలిసి నిర్మించారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందించిన ఈ మూవీ సెప్టెంబర్‌ 28న విడుదలైంది. ఈ తమిళ చిత్రం తెలుగులో గాడ్‌ పేరిట విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ తేదీ ఖరారైంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్‌ 26 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. గాడ్‌ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో ఆశిష్‌ విద్యార్థి, చార్లీ, అశ్విన్‌ కుమార్‌, రాహుల్‌ బోస్‌, విజయలక్ష్మి, వినోద్‌ కిషన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

సినిమా కథేంటంటే..
సినిమా కథ విషయానికి వస్తే.. నగంలో వరుసగా అమ్మాయిలు హత్యకు గువుతుంటారు. అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి అత్యంత కిరాతకంగా చంపేస్తున్న సైకో కిల్లర్‌ను ఐపీఎస్‌ ఆఫీసర్‌ అర్జున్‌ పట్టుకుంటాడు. కానీ కిల్లర్‌ను పట్టుకున్న తర్వాత కూడా హత్యలు జరుగుతూనే ఉంటాయి. మరి వాళ్లను ఎవరు చంపుతున్నారు? ఈ మర్డర్‌ మిస్టరీలను ఎలా ఛేదించారు? అనేది తెలియాలంటే గాడ్‌ సినిమాను ఓటీటీలో చూసేయాల్సిందే!

చదవండి: పదేళ్లయినా నాకోసం ఎదురుచూస్తున్నారు: కియాఆ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)