AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..
Breaking News
పెద్దిపై జపనీస్ ప్రేమ.. ఉద్యోగానికి సెలవులు పెట్టి మరి..!
Published on Thu, 06/04/2026 - 19:50
మెగా హీరో రామ్ చరణ్ పెద్ది మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఎన్నో రోజులు వెయిట్ చేసిన అభిమానుల నిరీక్షణకు తెరపడింది. బుధవారం రాత్రి నుంచే పెద్ది హవా మొదలైంది. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే పాన్ ఇండియా రేంజ్‌లో పెద్దికి అభిమానుల ఆదరణ లభిస్తోంది.
అయితే రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతనికి జపాన్‌లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రామ్ చరణ్‌పై అభిమానంలో ఏకంగా జపాన్ మహిళలు హైదరాబాద్‌కు వచ్చేశారు. పెద్దిని చూసేందుకు రూ.2 లక్షల ఖర్చు పెట్టి మరి ఇండియాలో ల్యాండయ్యారు. ఉద్యోగానికి ఐదు రోజులు సెలవు పెట్టి మరి రెండు రోజుల ముందే నగరానికి చేరుకున్నారు జపాన్ అభిమానులు మసామీ, క్రిస్. తమ స్నేహితురాలు కణ్మనితో కలిసి నగరంలోని మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాను ఆస్వాదించారు. పెద్ది సినిమా కేవలం ఒక షో కాదు.. ఏకంగా 10 షోలు చూశాకే జపాన్ విమానం ఎక్కుతామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Japan Rc fans watched #Peddi at bramarambha ❤️🔥
Their love for @AlwaysRamCharan is unconditional 🥹❤️ pic.twitter.com/DZSEqfsWcb— Mr.RK (@RavikumarJSP) June 4, 2026
Tags : 1