Breaking News

జైలర్ 2 వర్సెస్ రణబాలి.. అదొక్కటే పెద్ద మైనస్..!

Published on Sun, 10/18/2026 - 13:07

ఈ ఏడాది దసరా బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. ఒకటి రజినీకాంత్ హీరోగా వచ్చిన జైలర్-2 కాగా..  విజయ్ దేవరకొడం రణబాలి రెండోది. ఈ రెండు పెద్ద సినిమాలు కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే రిలీజయ్యాయి. తొలిరోజే పాజిటివ్ టాక్ అందుకున్న జైలర్-2 వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

మరోవైపు విజయ్ దేవవరకొండ-రష్మిక జంటగా వచ్చిన రణబాలి మాత్రం మొదటి రోజే మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో వసూళ్లపరంగా బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ మొదలైంది. జైలర్‌-2, రణబాలి చిత్రాల మధ్య ప్రధాన తేడా ఏంటనే విషయంపై చర్చించుకుంటున్నారు. ఈ రెండు సినిమాల్లో ఉన్న ప్లస్, మైనస్‌లు ఏంటేనేది ఆరా తీస్తున్నారు.

అదే ప్రధాన తేడా..

ఈ రెండు చిత్రాల కథ, కథనం పక్కనపెడితే ప్రధాన వ్యత్యాసం అదేనని అంటున్నారు. జైలర్-2 మూవీకి అనిరుధ్ రవిచందర్‌ బీజీఎం మరోస్థాయికి తీసుకెళ్లిందని చెబుతున్నారు. మరోసారి తన టాలెంట్‌తో మ్యాజిక్ చేశారని కొనియాడుతున్నారు. సోషల్ మీడియాలో అనిరుధ్ బీజీఎంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అయితే రణబాలి మూవీకి ఆ స్థాయిలో బీజీఎం లేకపోవడ పెద్ద మైనస్‌గా భావిస్తున్నారు. ఈ చిత్రంలో బలమైన కథాంశం, సన్నివేశాలు ఉన్నప్పటికీ థియేటర్‌లో ఆశించిన స్థాయి రాణించలేకపోయిందని అంటున్నారు. ముఖ్యంగా అజయ్-అతుల్ బీజీఎం తగిన స్థాయిలో వర్కవుట్ కాలేదని చెబుతున్నారు. బీజీఎం లోపం వల్లే కొన్ని సీన్స్‌కు హైప్ తీసుకురావడంలో తేలిపోయిందని అంటున్నారు. కథ, కథనం బాగానే ఉన్నప్పటికీ రణబాలిని బీజీఎం దెబ్బతీసిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు సినిమాలకు  ఉన్న ప్రధాన తేడా అదేనని.. అందుకే జైలర్-2 దూసుకెళ్తంటే.. రణబాలి వెనకపడి పోయిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే సినిమాకు బీజీఎం ఎంత ముఖ్యమో అర్థమవుతోంది. 
 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)