Breaking News

ఓం రౌత్ నిర్మాతగా ఓటీటీ సినిమా.. ట్రైలర్ రిలీజ్

Published on Mon, 08/25/2025 - 13:58

తెలుగులో తక్కువ గానీ బాలీవుడ్‌లో కొత్త సినిమాల్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఓ మూవీని అలానే స్ట్రీమింగ్‌కి సిద్ధం చేశారు. 'ఆదిపరుష్' దర్శకుడు ఓం రౌత్.. మరో ఇద్దరితో కలిసి నిర్మించిన కామెడీ థ్రిల్లర్ సినిమా ఇది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 27 సినిమాలు)

'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ బాజ్‌పాయ్.. 'ఇన్‌స్పెక్టర్ జెండే' పేరుతో తీసిన ఈ చిత్రంలో పోలీసుగా నటించాడు. ముంబైకి చెందిన పోలీస్ అధికారి మాధవ్ జెండే జీవితం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. 1970-80‍ల్లో మాధవ్ జెండే పనిచేస్తున్న టైంలో ఛార్లెస్ శోభరాజ్ సీరియల్ కిల్లర్‌గా వార్తల్లో నిలిచాడు. అయితే మాధవ్.. శోభరాజ్‌ని రెండుసార్లు పట్టుకున్నాడు. 1971లో తొలిసారి అరెస్ట్ చేయగా 1986లో తిహార్ జైలు నుంచి తప్పించుకున్నాడు. తర్వాత మళ్లీ గోవాలో అదుపులోకి తీసుకున్నారు.

ఇప్పుడు ఈ స్టోరీని కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్‍‪‌గా తీశారు. డైరెక్టర్ ఓం రౌత్.. దీనికి ఓ నిర్మాతగా వ్యవహరించారు. అయితే థియేటర్లలోకి కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబరు 05 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే మంచి మూవీ చూడబోతున్నామనే ఫీల్ అయితే కలిగించారు. ఇది తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీలో ఛార్లెస్ శోభరాజ్ పాత్రలో 'కుబేర' ఫేమ్ జిమ్ షర్బ్ నటించడం విశేషం.

(ఇదీ చదవండి: విషాదం.. 'కేజీఎఫ్' నటుడు కన్నుమూత)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)