Breaking News

'పుష్ప' పాటకు మనవాళ్ల డ్యాన్స్‌.. స్టాండింగ్ ఒవేషన్‌తో అమెరికన్స్‌

Published on Thu, 06/29/2023 - 12:19

'ఇండియన్ డ్యాన్స్ గ్రూప్ వారియర్ స్క్వాడ్' ఇటీవల 'అమెరికాస్ గాట్ టాలెంట్'లో ఆడిషన్స్ ఇచ్చి అక్కడ సెలక్ట్‌ అయింది. హర్యానాకు చెందిన గురుగ్రామ్‌లో ఓ చిన్న గ్రామం నుంచి ఆ టీమ్‌ అమెరికా చేరుకుంది. వారు చేసిన డ్యాన్స్‌ను చూసి ఆ షో జడ్జిలంతా ఆశ్చర్యపోయారు. షో చూసేందుకు వచ్చిన వారందరూ కూడా వీరి డ్యాన్స్‌కు ఫిదా అయిపోయారు. షోలో జడ్జీలుగా వ్యవహిరిస్తున్న వారందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. 

(ఇదీ చదవండి: 'తీవ్రమైన ఇన్ఫెక్షన్'తో ఆసుపత్రి పాలైన ప్రముఖ సింగర్‌)

ఇంతలా వారందరిని మెప్పించిన ఈ గ్రూపు ఎంచుకున్న పాట  ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప' చిత్రంలోనిది కావడం విశేషం. 'ఏయ్‌ బిడ్డా.. ఇది నా అడ్డా' పాట సాయంతో వారు డేంజరస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తాజాగా ఈ గ్రూప్‌ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 

న్యాయనిర్ణేతలు ఏమన్నారంటే.. 
షో జడ్జీలు అయినటువంటి హెడీ క్లమ్, సోఫియా వెర్గారా, సైమన్ కోవెల్ ఈ ఇండియన్ డ్యాన్స్ గ్రూప్ ప్రదర్శన చూసి ఆశ్చర్యపోయారు. సోఫియా వారిని మెచ్చుకుంటూ.. 'మీరందరూ చాలా గొప్ప ప్రదర్శన ఇచ్చారు. మీరు గ్రూప్‌గా ఉన్న కూడా అందరూ ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఇది నిజంగా మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.' అని చెప్పింది. అదే సమయంలో.. మీకు పోటీ లేదు. మీరు చేసిన డ్యాన్స్‌ అద్భుతమైనది అని హెడీ అన్నారు. 

(ఇదీ చదవండి: RRR: ఆస్కార్ సభ్యుల జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయంటే)

హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ఒక చిన్న గ్రామం నుంచి వచ్చామని,  ఒక NGO సహాయంతో అమెరికాలో ప్రదర్శన ఇచ్చే అవకాశం వచ్చిందని ఆ డ్యాన్స్‌ గ్రూప్‌ లీడర్‌ తెలిపాడు. వారికి అయ్యే ఖర్చులన్ని ఆ సంస్థే భరించిందని వారు తెలిపారు. 'అమెరికాస్ గాట్ టాలెంట్' పేరుతో అక్కడ 18వ సీజన్ తాజాగా ప్రారంభమైంది.  మొదటి సీజన్ 2006లో ప్రసారమైంది. అక్కడ గెలుపొందిన వారికి భారిగానే ప్రైజ్‌ మనీ అందుతుంది.  మన 'ఇండియన్ డ్యాన్స్ గ్రూప్ వారియర్ స్క్వాడ్' అక్కడ 'ఏయ్‌ బిడ్డా.. ఇది నా అడ్డా' అంటూ బన్నీ పాటతో అదరగొడుతుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)