Breaking News

రకుల్‌ నుంచి మానుషి వరకు.. మిలిటరీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న సెలబ్రిటీలు ఎవరంటే?

Published on Fri, 08/15/2025 - 12:34

కాదేదీ సినిమాకు అనర్హం అన్నట్లుగా ప్రపంచంలో, సమాజంలో ఉన్న ప్రతీది ఓ కథా వస్తువే! కల్పితాలతో పాటు రియల్‌ స్టోరీలను కూడా వెండితెరపై చూపిస్తూ ఉంటారు. అలా దేశాన్ని సరిహద్దులో ఉండి కాపాడుతున్న సైనికుల పోరాటాలు, జీవన విధానాలు తెరపై ఎన్నోసార్లు ఆవిష్కృతమై బాక్సాఫీస్‌ వద్ద అద్భుతాలు సృష్టించాయి. అయితే సినిమాలోనే కాకుండా నిజ జీవితంలోనూ కొందరు సైనికులుగా సేవ చేస్తే మరికొందరు సెలబ్రిటీలకేమో మిలిటరీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉంది. నేడు (ఆగస్టు 15) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినీ ఇండస్ట్రీలో మిలటరీ నేపథ్యం ఉన్న తారలెవరో ఓసారి చూసేద్దాం..

రకుల్‌, అనుష్క పేరెంట్స్‌..
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తండ్రి రాజేంద్ర సింగ్‌ ఆర్మీ అధికారి. అక్షయ్‌ కుమార్‌ (Akshya Kumar) తండ్రి హరి ఓం భాటియా విశ్రాంత ఆర్మీ అధికారి. అనుష్క శర్మ తండ్రి కల్నల్‌ అజయ్‌ కుమార్‌ శర్మ కార్గిల్‌ యుద్ధంలోనూ భాగమయ్యారు. అనుష్క విద్యాభ్యాసమంతా బెంగళూరులోని ఆర్మీ స్కూల్‌లోనే జరిగింది. ప్రియాంక చోప్రా తల్లిదండ్రులు మధు - అశోక్‌ చోప్రా ఇండియన్‌ ఆర్మీలో వైద్యులుగా సేవలందించారు. నటి లారా దత్తా తండ్రి ఎల్‌కే దత్తా ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ వింగ్‌ కమాండర్‌గా పని చేశారు. 

ఉగ్రదాడిలో వీరమరణం
సుష్మితా సేన్‌ తండ్రి శుభీర్‌ సేన్‌ ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో వింగ్‌ కమాండర్‌గా సేవలందించారు. నిమ్రత్‌ కౌర్‌ తండ్రి, ఆర్మీ అధికారి మజోర్‌ భూపిందర్‌ సింగ్‌.. 1994లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందారు. ప్రీతి జింటా తండ్రి దుర్గానంద్‌ కూడా ఓ జవానే! తెలుగు నటి గాయత్రి గుప్తా తాతయ్య సైతం ఆర్మీలో పని చేశాడు. బ్రిటీష్‌ వారి చేతిలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. శ్రద్ధా శ్రీనాథ్‌ తండ్రి కూడా ఆర్మీ అధికారే!

దిశా పటానీ సోదరి కూడా..
నేహా ధూపియా తండ్రి ప్రదీప్‌ సింగ్‌ ఇండియన్‌ నేవీలో కమాండర్‌గా పని చేశారు. మానుషి చిల్లర్‌ తండ్రి మిత్ర బసు చిల్లర్‌ డీఆర్‌డీఓ (డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌)లో ఫిజీషియన్‌గా పని చేశారు. గుల్‌ పనగ్‌ తండ్రి లెఫ్టినెంట్‌ జనరల్‌ పనగ్‌.. మిలిటరీలో అందించిన సేవలకుగానూ పరమ విశిష్ట్‌ సేవా పురస్కారం అందుకున్నారు. దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ ఇండియన్‌ ఆర్మీలో మేజర్‌గా సేవలందిస్తున్నారు.

చదవండి: బాలీవుడ్‌ తారలు.. నిజ జీవితంలో సైనికులు..

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)