Breaking News

ప్రియురాలికే తన ఫ్లాట్ అద్దెకిచ్చిన 'వార్ 2' హీరో

Published on Wed, 08/27/2025 - 12:13

ప్రముఖ నటీనటులు.. ఇల్లు, అపార్ట్‌మెంట్ లాంటివి కొనడం, అమ్మడం, అద్దెకు ఇవ్వడం లాంటివి బాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. తెలియని వాళ్లకు ఇచ్చేందుకు హిందీ సెలబ్రిటీస్ పెద్దగా ఆసక్తి చూపించరు. దీంతో తోటి యాక్టర్స్‪‌కి అద్దెకు ఇస్తుంటారు. దీని ద్వారా మంచి మొత్తమే అందుకుంటూ ఉంటారు. కానీ 'వార్ 2'తో రీసెంట్‌గా వచ్చిన హృతిక్ రోషన్ మాత్రం తన ప్రియురాలికి తన ఫ్లాట్ రెంట్‌కి ఇచ్చాడు. అవును మీరు విన్నది నిజమే.

(ఇదీ చదవండి: 'సుందరకాండ' సినిమా రివ్యూ)

క్రిష్, ధూమ్ 2 లాంటి సినిమాలతో చాన్నాళ్ల క్రితమే తెలుగులోనూ క్రేజ్ సొంతం చేసుకున్న హృతిక్ రోషన్.. చాలా గ్యాప్ తర్వాత 'వార్ 2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్టీఆర్ ఇందులో మరో హీరోగా నటించడం విశేషం. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఫెయిలైంది. సరే ఈ సంగతి పక్కనబెడితే గతంలో సుస్సానే ఖాన్ అనే మహిళని పెళ్లి చేసుకున్న హృతిక్.. కొన్నేళ్ల క్రితం ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. నటి షబా ఆజాద్‌తో రిలేషన్‌లో ఉన్నాడు.

హృతిక్ ప్రస్తుతం షబా ఆజాద్‌తో డేటింగ్ చేస్తున్నప్పటికీ.. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లు ఫ్లాట్‌ని హృతిక్.. తన ప్రియురాలికే అద్దెకిచ్చాడు. ఇందుకుగానూ నెలకు రూ.75 వేలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. సాధారణంగా మార్కెట్‌లో లక్షల్లో అద్దె ఉంటే.. ప్రియురాలికి మాత్రం తక్కువ ధరకే ఇచ్చేశాడట. అంటే డిస్కౌంట్ అనమాట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.

(ఇదీ చదవండి: కోట్లు విలువ చేసే కారు కొన్న 'కేజీఎఫ్' విలన్)

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)