Breaking News

జా.ఎన్టీయార్, హృతిక్‌ల వార్‌2 వసూళ్లు.. రూ.100కోట్లు..

Published on Wed, 05/14/2025 - 11:43

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ హృతిక్‌ రోషన్(Hrithik Roshan), టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌, స్టార్‌ హీరో ఎన్టీఆర్‌(Jr NTR) జంటగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వార్‌ 2‘(War 2) విడుదల కాకముందే సంచలనాలు నమోదు చేయడం మొదలైంది. హృతిక్, ఎన్టీయార్‌ ల అనూహ్య కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ మొదలైన నాటి నుంచే సంచలనంగా మారింది. 

ఈ చిత్రం ద్వారా హృతిక్‌ రోషన్‌ మళ్లీ తన స్పై క్యారెక్టర్‌ ’కబీర్‌’గానే  స్క్రీన్‌ మీదకి రానుండగా, మొదటి సారిగా ఎన్టీఆర్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నాడని తెలియడం మరింత ఆసక్తిని పెంచింది. ఉత్తరాది, దక్షిణాదికి చెందిన ఇద్దరు అగ్రహీరోలు పరస్పరం తెరపై తలపడడం గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కియారా అడ్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగానూ బాలీవుడ్, టాలీవుడ్‌ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. 

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ‘వార్‌ 2‘ పాన్‌ ఇండియా స్థాయిలో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతానికి దక్షిణాది వ్యాప్తంగా ఈ సినిమా హైప్‌కి ప్రధాన కారణం జూ.ఎన్టీఆర్‌ కి ఇటీవలి కాలంలో అమాంతం పెరిగిన క్రేజ్‌ అనేది నిస్సందేహం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్టీఆర్‌ హవా ఇటీవల రెట్టింపైంది. ఆర్‌ఆర్‌ఆర్, దేవర...ఇలా వరుసగా బాక్సాఫీస్‌ దగ్గర వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్న ఎన్టీఆర్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండడమే  సినిమా రైట్స్‌ కోసం టాలీవుడ్‌  నిర్మాతలు ఎగబడడానికి కారణంగా చెప్పొచ్చు. 

ఈ నేపధ్యంలో  విడుదలకి ముందే ప్రాంతీయ డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ అమ్ముడైపోవడం ఓ రికార్డ్‌గా చెప్పాలి. తద్వారా ఈ సినిమా భారత మూవీ మార్కెట్‌లో ఓ కొత్త ట్రెండ్‌కి కొబ్బరికాయ కొట్టినట్టయింది.  భాషా అంతరాలను దాటి స్టార్‌ హిరోల క్రేజ్, మల్టీ లాంగ్వేజ్‌ సినిమాలకి పెరిగిన ఆదరణ కారణంగా ఇటువంటి డీల్స్‌ ముందుగానే ఖరారవడం ఇక షురూ కావచ్చు. ఈ సినిమా ప్రాంతీయ హక్కుల కోసం ఎదురైన గట్టి పోటీని తట్టుకుని చివరికి  ప్రముఖ నిర్మాతలు నాగా వంశీ, సునీల్‌ నారంగ్‌  ఈ లాభదాయకమైన డీల్‌ను  చేజిక్కించుకున్నారు. 

విడుదలకి మూడేళ్లు ముందే ఈ చిత్రం తెలుగు థియేట్రికల్‌ హక్కులు రూ. 85–100 కోట్ల మధ్య ధరల్లో అమ్ముడైపోయాయని వార్తలు వస్తున్నాయి.  వీటన్నింటి నేపధ్యంలో ఆగస్టు 14, 2025న విడుదల కానున్న ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)