తమిళ బోల్డ్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ

Published on Tue, 02/24/2026 - 19:17

ఓటీటీలోకి ప్రతివారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇతర భాషల చిత్రాలు కూడా స్ట్రీమింగ్‌లోకి వస్తుంటాయి. అలా గతవారం ఓటీటీలోకి వచ్చిన తమిళ బోల్డ్ మూవీ 'హాట్‪‌స్పాట్ 2 మచ్'. ఏకంగా ఆరు ఓటీటీల్లో ఒకేసారి అందుబాటులోకి వచ్చింది. అయితే అన్నింటిలోనూ ఒరిజివల్ వెర్షన్ మాత్రమే రిలీజైంది. తాజాగా ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కోసం డబ్బింగ్ రూపంలోనూ తీసుకురానున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!)

2024లో తొలి పార్ట్ రిలీజ్ కాగా ఈ ఏడాది థియేటర్లలో సీక్వెల్ రిలీజ్ చేశారు. ప్రియాభవనీ శంకర్ లీడ్ రోల్ చేసింది. మొత్తంగా మూడు బోల్డ్ స్టోరీలని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. ఫ్యాన్స్ వార్స్, డ్రస్సింగ్ సెన్స్, నిజమైన ప్రేమ అనే కాన్సెప్ట్స్‌ని షాకిచ్చే స్టైల్లో ప్రెజెంట్ చేశారు. తమిళంలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు శుక్రవారం(ఫిబ్రవరి 27) నుంచి ఆహా ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.

'హాట్‌స్పాట్ 2' విషయానికొస్తే.. శిల్ప(ప్రియా భవానీ శంకర్) అనే అమ్మాయి ఓ నిర్మాత దగ్గరకు స్టోరీ నెరేషన్ ఇవ్వడానికి వస్తుంది. మూడు కథలు చెబుతుంది. వీటిలో మొదటిది హీరోలని పిచ్చిగా అభిమానించే ఓ ఇద్దరు కుర్రాళ్ల గురించి కాగా.. రెండోది డ్రస్సింగ్ సెన్స్ గురించి.. మూడోది టైమ్ ట్రావెల్ ప్రేమకథ. ఇవన్నీ ఒకదాన్ని మించి ఒకటి అనేలా ఉంటాయి. అసలు శిల్ప ఎవరు? ఈ నిర్మాత దగ్గరకే ఎందుకొచ్చింది? ఈ స్టోరీలు చెప్పడం వెనక ఉద్దేశం ఏంటి?  అనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: తమిళ బోల్డ్ సినిమా 'హాట్‌స్పాట్ 2 మచ్' తెలుగు రివ్యూ)

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)