Breaking News

ఓటీటీలో క్రేజీ యానిమేషన్ మూవీ.. తెలుగు రివ్యూ

Published on Sat, 05/02/2026 - 18:09

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొట్టేస్తున్నాయి. స్కూల్స్‌కి సెలవులు ఇచ్చేయడంతో పిల్లలు తెగ అల్లరి చేస్తూ తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో పిల్లల్ని ఎలా ఎంటర్‌టైన్ చేయాలా అని పేరెంట్స్ చాలానే ఆలోచిస్తున్నారు. అయితే ఓటీటీల్లో పిల్లలని ఎంటర్‌టైన్ చేస్తూ విలువలు నేర్పించే యానిమేషన్ సినిమాలు కొన్ని ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులోకి మరొకటి చేరింది. రీసెంట్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన 'హాపర్స్' చిత్రాన్ని పిల్లలతో పాటు పెద్దోళ్లు కూడా చూడొచ్చు. ఇంతకీ ఇదెలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్)

కథేంటి?
బీవర్టన్ అనే ఊరిలో మేబల్ అనే అమ్మాయి ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఈమెకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. పెద్దయి కాలేజీకి వెళ్లినా అది తగ్గదు. ఊరిలో ఫ్లైఓవర్ కడుతున్నారని, కానీ దీనికోసం పెద్ద చెరువుని కూల్చేశారని, అందులో జంతువులని బెదరగొట్టి పంపించేశారని తెలిసి బాధపడుతుంది. ఆ జంతువులని తిరిగి ఇక్కడికి ఎలా తీసుకురావాలా, ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని ఎలా అడ్డుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఓ రోజు అనుకోని విధంగా ఈమె ఆత్మ.. బీవర్ అనే జంతువులో ప్రవేశిస్తుంది. తర్వాత ఏమైంది? బీవర్ శరీరంలో ఉన్న మేబల్.. మిగిలిన జంతువులతో కలిసి ఆ ఫ్లైఓవర్ కట్టడాన్ని అడ్డుకుందా లేదా అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
రెగ్యులర్ సినిమాలతో పోలిస్తే యానిమేషన్ సినిమాలకు సెపరేట్ ఆడియెన్స్ ఉన్నారు. హాలీవుడ్‌లో ఈ తరహా మూవీస్ ఎక్కువగా వస్తుంటాయి. అలా ఈ ఏడాది మార్చిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజై ఆకట్టుకున్న చిత్రమే 'హాపర్స్'. సరదా సరదాగా సాగిపోతూనే ప్రకృతి ఎంత గొప్పదో చెబుతుంది. కేవలం గంటన్నర మాత్రమే ఉండే ఈ సినిమా పిల్లలతో పాటు పెద్దలు కూడా చూడొచ్చు.

ప్రస్తుతం నాగరికత పేరు చెప్పి ఎక్కడపడితే అక్కడ చెట్లు కొట్టేస్తున్నారు. బిల్డింగులు కట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా చెట్లు లేదా అడవులపై ఆధారపడి జీవిస్తున్న జంతువుల జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. జంతువులు మూగజీవులు కాబట్టి మనుషుల్ని అవేం చేయలేవు. ఒకవేళ వాటికే మనిషిలా ఆలోచించగలిగే శక్తి వస్తే ఏం చేస్తాయి అనే చిత్రమైన కాన్సెప్ట్‌తో తీసిన 'హాపర్స్' అద్భుతంగా ఉంది.

పాయింట్ పరంగా కొత్తదేం కాదు కానీ చూపించిన ఎమోషన్స్ గానీ చేసిన కామెడీ గానీ బాగా కుదిరాయి. అడవిలో జంతువుల మధ్య సాగే హంగామా కూడా అదిరిపోయేలా డిజైన్ చేశారు. పిక్సర్స్ స్టూడియోస్ తీసిన ఈ సినిమాలో నాన్నమ్మ-మనవరాలి ఎమోషన్ కూడా ఆకట్టుకునేలా ఉండటం విశేషం. మనిషి.. ప్రకృతిని నాశనం చేస్తున్నాడు గానీ ఉపద్రవం వచ్చినప్పుడు ఆ ప్రకృతే మనిషిని కాపాడటం అనే పాయింట్‌ని చూపించిన విధానం బాగుంది.

ప్రస్తుతానికి ఈ సినిమా ఆపిల్ టీవీ, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో రెంట్ విధానంలో ఉంది. ఇంగ్లీష్ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. సమ్మర్ హాలీడేస్‌లో మీ పిల్లలకు ఏదైనా మంచి మూవీ చూపిద్దామనుకుంటే దీన్ని ట్రై చేయండి. కచ్చితంగా నచ్చుతుంది.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Videos

సీరియల్ ఇండస్ట్రీలో నెపోటిజం చాలా అవమానాలు పడ్డా.. ఒకరోజు నాగార్జున కాల్ చేసి..!

ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం. AI వీడియో..

ప్రాణం తీసిన పాపులారిటీ భార్యపై ఈగోతో కొడవలితో హత్య

మార్కెట్లు కుప్పకూలిన జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన స్టాక్

నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ నైజం

ట్యూషన్ వెళ్తున్న బాలుడి కిడ్నాప్ తెలివిగా తప్పించుకుని పేరెంట్స్ కి ఫోన్..

దళితులపై రఘురామ వ్యాఖ్యలు ఇచ్చిపడేసిన మందకృష్ణ మాదిగ

ఆందోళన చేస్తున్న మహిళలను ఈడ్చిపడేసిన పోలీసులు

విజయ్ అనే నేను.! ప్రమాణ స్వీకారానికి ప్రాక్టీస్ చేస్తున్న దళపతి

నీకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య నువ్వా మా పార్టీ కోసం మాట్లాడేది

Photos

+5

యాంకర్ రష్మి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ సావిత్రి కుమార్తె 21 రోజుల వేడుక (ఫొటోలు)

+5

మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్‌.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)

+5

తెలంగాణలో గుహ మధ్య అద్భుతమైన ఆలయం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : వైద్య విద్యార్థుల ఆనందం చెట్ట‘పట్టా’ల్‌ (ఫొటోలు)

+5

ఏపీ : పలు జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం (ఫొటోలు)

+5

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రిసెప్షన్‌: ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో మ్యాడ్ స్క్వేర్‌ బ్యూటీ రెబా మోనికా జాన్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి మీనా వాసు మ్యారేజ్ డే.. భర్తకు స్పెషల్ విషెస్ (ఫోటోలు)