Breaking News

ది గర్ల్‌ఫ్రెండ్‌ చూసి నా భార్య, నేను ఎమోషనలయ్యాం!

Published on Fri, 11/07/2025 - 10:08

‘‘తెలుగులో నేను అంగీకరించిన తొలి సినిమా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ (The Girlfriend Movie). కాకపోతే ‘ఖుషి’ తో నా ఎంట్రీ జరిగింది. ‘ఖుషి, హాయ్‌ నాన్న, మనమే, 8 వసంతాలు’... ఇలా నా మ్యూజిక్‌ డైరెక్షన్‌లో వచ్చిన ప్రేమకథా చిత్రాలతో పోల్చినప్పుడు ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ కి కాస్త విభిన్నమైన సంగీతం అందించాను. ఎందుకంటే... ఇది ఇంటెన్స్‌ లవ్‌స్టోరీ’’ అని చెప్పారు సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ (Hesham Abdul Wahab). రష్మికా మందన్నా ప్రధాన పాత్రలో, దీక్షిత్‌ శెట్టి మరో లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’. 

నా భార్యతో సినిమా చూశా..
రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ చిత్రం నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ మాట్లాడుతూ.. ‘‘మహిళలు, నేటి తరం యువత, తల్లిదండ్రులు ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమాను కచ్చితంగా చూడాలన్నది నా అభిప్రాయం. నా భార్యతో కలిసి నేను ఈ సినిమా చూశాను. మేం భావోద్వేగానికి లోనయ్యాం. నేటి సమాజంలోని ఓ అంశాన్ని ప్రస్తావించారు రాహుల్‌ రవీంద్రన్‌. రష్మిక, దీక్షిత్‌ అద్భుతంగా నటించారు.  సంగీతానికి ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) వాడలేదు. 

ఆ సినిమాకు ఏఐ వాడా..
కానీ సినిమా మేకింగ్‌ ప్రాసెస్‌లో కొంత ఏఐ వాడాం. ‘హాయ్‌ నాన్న’ సినిమాకు సంగీతంలో ఏఐ వాడాను. ఏఐ మన జీవితాల్లో భాగమైపోయింది. హైదరాబాద్‌ నా సెకండ్‌ హోమ్‌ అయిపోయింది. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నాను. ప్రస్తుతం ఆనంద్‌ దేవరకొండ కొత్త సినిమాకు సంగీతం అందిస్తున్నాను. తమిళంలో ఓ సినిమాకు, కన్నడంలో గణేశ్‌గారి సినిమాకు సంగీతం అందిస్తున్నాను. కన్నడలో నా తొలి మూవీ ఇది. హిందీలో నా తొలి సినిమా ఖరారైంది. త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది’’ అని చెప్పారు.

చదవండి: సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన రాజమౌళి.. ఒక్క ట్వీట్‌తో..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)