Breaking News

హోంమంత్రి అనిత మాటలు పచ్చి అబద్ధం: హీరోయిన్‌ మాధవీలత

Published on Mon, 09/09/2024 - 16:59

ఏపీ హోమంత్రి వంగలపూడి అనిత వినాయక విగ్రహాల చలాన్లపై పచ్చి అబద్ధాలు చెబుతున్నారని హీరోయిన్‌, బీజేపీ నాయకురాలు మాధవీలత అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలో కేవలం మండపాలకే మాత్రమే రుసుములు ఉండేవని తెలిపారు. విగ్రహాల అడుగుల ఎత్తు, ఎకో గణేశా పేరిట ప్రత్యేకంగా ఎలాంటి చలాన్లు లేవని ఆమె స్పష్టం చేశారు. ఇవన్నీ కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ అని వెల్లడించారు. 

అయితే పది రోజుల క్రితం హోంమంత్రి అనిత ప్రెస్‌మీట్‌లో ఈ రూల్స్‌ ప్రకటించడం అక్షర సత్యమన్నారు. కొత్తగా తెచ్చిన రూల్స్‌ గురించి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీదే కదా? అని మాధవీలత ప్రశ్నించారు. మేము కాషాయ కండువాలు మోసే వాళ్లమని..డబ్బులతో నన్ను ఎవరూ కొనలేరని స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను రిలీజ్‌ చేశారు. 

(ఇది చదవండి: అనితక్కా.. ఏందీ నీ తిక్కా.. ఏపీ హోం మంత్రిపై మాధవీలత ఫైర్)

మాధవీలతపై నెటిజన్ల ప్రశంసలు..

ఆమె వీడియో చూసిన నెటిజన్స్ మాధవీలతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తప్పును ధైర్యంగా ప్రశ్నించారంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. మీరు నిజాయితీగా ప్రభుత్వం చేసిన తప్పును ఎత్తి చూపారని.. ఎప్పటికీ మీరు ఇలాగే ఉండాలంటూ మాధవీలతను ప్రశంసిస్తున్నారు.   

కాగా.. అంతకుముందు వినాయక విగ్రహాలకు ఇష్టారీతిన చలాన్లు విధించండంపై హీరోయిన్ మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేసింది. వినాయక చవితి సందర్భంగా చలాన్లపై ఆదేశాలు జారీ చేయడం ఎంతవరకు సబబు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. గణేశ్ మండపాల దగ్గర చిల్లర డబ్బులు ఏరుకోవడం ఏంటని ఆమె మండిపడ్డారు. డబ్బులు కావాలంటే దానం చేస్తాం.. అంతే కానీ ఇలా మండపాల దగ్గర చిల్లర అడుక్కోవడమేంటి అక్కా? అంటూ హోంమంత్రిని ప్రశ్నించారు. ఏపీలో చిన్నపిల్లపై అత్యాచారం జరిగితే ఇంతవరకు  ఆ కేసు ఏమైందని హోంమంత్రిని మాధవీలత నిలదీశారు.
 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)