Breaking News

'హరిహర వీరమల్లు'.. ఏపీలో భారీగా టికెట్ రేట్ల పెంపు

Published on Sat, 07/19/2025 - 16:41

కొన్నాళ్ల కిందట పవన్ కల్యాణ్.. ఆం‍ధ్రాలోని పలు థియేటర్లలో కక్ష కట్టి తనిఖీలు చేయించారు. టికెట్ ధరలు, తినుబండారాల ధరలు తగ్గించాలని చాలా హడావుడి చేశారు. ఇప్పుడు తన సినిమా వస్తుండేసరికి స్వలాభం చూసుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే రేట్లు అలా పెంచేశారు. పవన్ నటించిన 'హరిహర వీరమల్లు'.. వచ్చే గురువారం(జూలై 24) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఒక్కో టికెట్ రేటు ఏకంగా రూ.600 వరకు ఉండేలా అనుమతి ఇవ్వడం ఇక్కడ ఆశ్చర్యపరుస్తోంది.

‍(చదవండి: హరి హర వీరమల్లు.. అందుకే హిందీలో ప్రమోషన్స్‌ చేయట్లేదు: నిర్మాత)

ఏపీలో గత ప్రభుత్వంలో బెనిఫిట్ షోలు రద్దు చేయగా.. ఇప్పుడు 'హరిహర వీరమల్లు' కోసం మళ్లీ వాటిని తీసుకొచ్చారు. 23న అంటే విడుదలకు ముందు రోజు రాత్రి 9 గంటల ప్రీమియర్ షోలకు అనుమతించారు. ఈ షోకి ఒక్కో టికెట్ ధర రూ.600గా నిర్ణయించారు. ఈ మేరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో లోయర్ క్లాస్ రూ.100, అప్పర్ క్లాస్ రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. మల్టీప్లెక్స్‌ల్లో అయితే ఏకంగా రూ.200 పెంచుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. రిలీజ్ రోజైన నాటి నుంచి 10 రోజుల పాటు రేట్ల పెంపు అమల్లో ఉండనుంది. 

(ఇదీ చదవండి: 'మెగా' లీకులు.. నిర్మాతలు గట్టి వార్నింగ్)

సినిమా ఇండస్ట్రీకి చెందిన పవన్ కల్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నారు. అంటే జనాలకు ఏది మంచిదో అది ఆయన చేయాల్సి ఉంటుంది. అలాంటి ఆయనే తన సినిమాకు ఎక్కువ రేటు వచ్చేలా చూసుకున్నారు. ఈ రేట్లకు అభిమానులు వెళ్లొచ్చేమో గానీ సాధారణ జనాలు వెళ్తారా అనేది చూడాలి. ఎందుకంటే రీసెంట్ టైంలో జనాలు థియేటర్లకు వెళ్లడమే చాలా తగ్గించేశారు. అలాంటిది ఇంతింత రేట్లు పెంచితే ఎలా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

'హరిహర వీరమల్లు' సినిమా దాదాపు ఐదేళ్లపాటు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ తీశారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్. బాబీ డియోల్ విలన్. తొలుత క్రిష్ డైరెక్టర్ కాగా.. మధ్యలో ఆయన తప్పుకొన్నారు. దీంతో నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు అందుకున్నారు. ఆయన మిగతా అంతా పూర్తి చేశారు. 

(ఇదీ చదవండి: 'జూనియర్' కలెక్షన్.. మొదటిరోజు అన్ని కోట్లా?)

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)