Breaking News

ప్రతిష్టాత్మక గామా అవార్డ్స్.. ప్రదానం చేసేది ఎప్పుడంటే?

Published on Mon, 02/17/2025 - 21:17

ప్రతిష్టాత్మక గామా అవార్డుల వేడుక అంతా సిద్ధమైంది. ఈ ఏడాది జరగనున్న ఐదో ఎడిషన్‌కు సంబంధించిన వివరాలను దుబాయ్ వేదికగా ప్రకటించారు. దుబాయ్‌లోని మైత్రి ఫార్మ్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో తేదీ, వేదికను ఖరారు చేశారు. ⁠ఈ వేడుకలో ప్రముఖ సింగర్ రఘు కుంచె  సమక్షంలో జ్యూరీ కమిటీని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు గామా అవార్డ్స్ గ్రాండ్ రివీల్‌ పేరిట ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రత్యేకమైన వేడుకకు దుబాయ్‌లోని 500 మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. వీరితో పాటు తెలుగు కళా, సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

మొట్టమొదటి సారి చాలా వినూత్నంగా ఈ గ్రాండ్ రెవీల్ ఈవెంట్ నిర్వహించారు. గామా అవార్డ్స్-2025 వేడుక  5వ ఎడిషన్  జూన్ 7, 2025న దుబాయ్ షార్జా ఎక్స్‌పో  సెంటర్లో నిర్వహించనున్నారు. ఈ జ్యూరీ చైర్ పర్సన్స్  సభ్యులుగా టాలీవుడ్ సినీ దర్శకులు ఏ. కొదండ రామిరెడ్డి ,  సంగీత దర్శకులు కోటి , సినీ దర్శకులు బి. గోపాల్ వారి ఆధ్వర్యంలో ఎంపికైన టాలీవుడ్ నటీనటులకు, సినిమాలకు  గామా అవార్ద్స్  అందజేస్తారు.

ఈ సందర్బంగా కుంచె రఘు గారు మాట్లాడుతూ..  'తెలుగు ఇండస్ట్రీ లో నాలాంటి కళాకారులు ఎందరో ఆసక్తిగా ఎదురు చూసే ఈవెంట్ గామా అవార్డ్స్. గామాతో మాకు చాలా మంచి అనుబంధం ఉంది. మా కళా కారుల అందరిని మంచి వసతులు ఇచ్చి చాలా బాగా చూసుకుంటామని చెప్పారు.  కాగా.. ఈ వేడుకలో  యాంకర్, సింగర్ తిరు, శరణ్య తమ చక్కటి ప్రదర్శనలతో వచ్చిన అతిధులను ఆకట్టుకున్నారు. సంగీత ప్రదర్శనలతో పాటు, ప్రత్యేకమైన వినోద కార్యక్రమాలతో ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)