Breaking News

ఓటీటీలోకి చావును వెంటాడే సినిమా.. ధైర్యం ఉంటేనే చూడండి (రివ్యూ)

Published on Sun, 10/19/2025 - 08:55

ఈ వీకెండ్‌లో మీరు అదిరిపోయే సినిమా చూడాలని అనుకుంటున్నారా..? అయితే, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్(Final Destination Bloodlines) చిత్రాన్ని చూసేయండి. అయితే, ఇందులో హింసాత్మకమైన సీన్స్‌ ఉంటాయి. మిమ్మల్ని కలవరపరిచే ఛాన్స్‌ ఉంది. కాబట్టి సున్నితమైన వారు, చిన్న పిల్లలు దూరంగా ఉండటం మంచిది. ఫైనల్ డెస్టినేషన్ మే 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కానీ, అక్టోబర్‌ 16న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తెలుగు వర్షన్‌ కూడా అందుబాటులో ఉంది. ఓటీటీలో అదిరిపోయే సూపర్ థ్రిల్లర్ సినిమా చూడాలనే ఆసక్తి ఉంటే దీనిని వదులుకోకండి. రూ.440 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.2700 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ మూవీ రన్‌టైమ్‌ కేవలం 1:50 మాత్రమే.

ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంఛైజీలో భాగంగా ఈ ఏడాది పార్ట్‌-6 విడుదలైంది. చివరిగా 2011లో వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ 5 తర్వాత సుమారు 14 ఏళ్లకు ఈ ఫ్రాంఛైజీ నుంచి ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ వచ్చింది. ఈ మూవీని దర్శకులు జాక్ లిపోవ్‌స్కీ, ఆడమ్ స్టీన్ తెరకెక్కించారు.  కైట్లిన్ శాంటా జువానా, రిచర్డ్ హార్మన్, టోనీ టాడ్ వంటి స్టార్స్‌ ఈ సినిమాలో నటించారు.

మన కుటుంబంలోని వ్యక్తులు ఏ విధంగా మరణిస్తారో ముందే తెలిస్తే ఎలా ఉంటుంది..? ఇదే కాన్సెప్ట్‌తో సినిమా కొనసాగుతుంది. అయితే, నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగానే ఈ మూవీని తీశామని మేకర్స్‌ చెప్పారు. ఇప్పటికే వచ్చిన ఈ ఫ్రాంఛైజీలోని 5 సినిమాలు కూడా ఇదే రేంజ్‌లో ఉంటాయి. తాజాగా విడుదలైన పార్ట్‌-6 కథ విషయానికి వస్తే..  1968లో ఓ స్కై వ్యూ హోటల్‌లో జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి, వందల మందిని కాపాడుతుంది ఐరిస్ (బ్రెక్ బాసింగర్). జరగబోయే ప్రమాదం గురించి ఆమె పసిగట్టేస్తుంది. అయితే, వారి ఆయుష్షు తీరినా కూడా ఐరిస్‌ తెలివిగా కొందరిని కాపాడుతుంది. ఎంతో ఘోరమైన ప్రమాదంలో చాలామంది దారుణమైన రీతిలో మరణిస్తారు. 

కానీ ఐరిస్‌ వల్ల  కొందరు ప్రాణాలతో బయటపడతారు. చావును ఎదిరించి ప్రాణాలతో ఉన్న వారిని ఒక్కొక్కరిగా చావు తరుముతూ వస్తుంది. అయితే, ఒక ఆర్డర్‌ ప్రకారమే వారు మరణిస్తారు. ఈ క్రమంలోనే వారందరినీ కాపాడిని ఐరిస్‌ వంతు ఒకరోజు వస్తుంది. ఆమె మరణిస్తే తన తర్వాతి కుటుంబ సభ్యులు కూడా చనిపోతారని గ్రహిస్తుంది. ఈ ఆర్డర్‌ను తప్పించేందుకు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? చావును ఎదిరించి ఎలా బతికింది..? తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఐరిస్ చాలా పకడ్బందీగా వేసుకున్న ప్లాన్ ఏంటి..? ఫైనల్‌గా తన కుటుంబ సభ్యులను కాపాడుకుందా..? ఈ క్రమంలోనే ఆమె మనవరాలు స్టేఫినీ (కైట్లిన్ శాంటా జువానా) చేసిన సాహసం ఏంటి..? అనేది తెలియాలంటే ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ చూడాల్సిందే. ఇందులో ఎలాంటి అసభ్యకరమైన సీన్లు  ఉండవ్‌.. ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ, ఘోరమైన ప్రమాదాలు కలవరపరిచేలా ఉంటాయి.

ఫైనల్ డెస్టినేషన్ కథ సింపుల్‌గానే ఉన్నప్పటికీ ప్రేక్షకుడిని థ్రిల​్‌ చేస్తూ.. సస్పెన్స్ తో కూడిన డెత్ సీన్స్ ట్రీట్ ఇస్తాయి. గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఉన్న ఆడియెన్స్  ఈ  మూవీకి దూరంగా ఉండటం మంచింది. మనిషి జీవితంలో మరణం ఏ రీతిలో పలకరిస్తుంది ముందే తెలుసుకుంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)