Breaking News

తగ్గని ‘ఇరుముడి’ ఫీవర్‌.. ట్రాక్టర్లతో పోటెత్తిన ప్రేక్షకులు

Published on Sat, 09/05/2026 - 16:55

శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన చిత్రం ‘ఇరుముడి’ . ఈ సినిమాకు తొలిరోజు నుంచే మంచి పాజిటివ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ను సైతం షేక్‌ చేస్తోంది. ఈ సినిమాలో రవితేజ తన పాత్రలో ఒదిగిపోయాడు. జీవీ ప్రకాశ్‌ అందించిన మ్యూజిక్‌ సైతం సినిమాకు ప్రాణం పోసింది. తండ్రీకూతురు సెంటిమెంట్‌కి అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని జోడించి తీసిన ఇరుముడిని చూసిన చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ తొలి కంటెస్టెంట్‌.. రైతుబిడ్డ ఝాన్సీ
ఈ సినిమా వచ్చి చాలా రోజుల అవుతున్నా ఇంకా ఇరుముడి ఫీవర్‌ నడుస్తూనే ఉంది.  పల్లె నుంచి పట్నం వరకు చిన్న, పెద్దా అని తేడా లేకుండా థియేటర్లకు క్యూ కడుతున్నారు. . అయితే ఈ సినిమాను చూసేందుకు గ్రామల నుంచి ప్రేక్షకులు ట్రాక్టర్లతో థియేటర్లకు తరలివెళ్లారు. ఇందులో వృద్ధులు, మహిళలే అధికంగా ఉండడం విశేషం. ఇప్పుడీ  వీడియో వైరల్‌ అవుతోంది.
200 కోట్లకు పైగా..
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'ఇరుముడి' (Irumudi Movie) బాక్సాఫీస్ వద్ద కేవలం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని దాటి సంచలనం సృష్టించింది. రవితేజ తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో రూ.200 కోట్ల మార్కును అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఇందులో ప్రియా భవానీ శంకర్, బేబి నక్షత్ర కీలక పాత్రలు పోషించారు.

ఎక్కువ మంది చదివింది: కీర్తి సురేశ్‌, నాని డ్యాన్స్‌ వైరల్‌.. ఈసారి క్రాస్‌ ఓవర్‌ వీడియో
 

 

Videos

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

Photos

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)