Breaking News

బిడ్డకు జన్మనిచ్చిన నటి.. తండ్రైన స్టార్‌ డైరెక్టర్

Published on Tue, 01/31/2023 - 19:43

ప్రముఖ తమిళ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ తండ్రయ్యారు. కొన్ని నెలల క్రితమే తన భార్య ప్రియా మోహన్ ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన భార్య, నటి ప్రియా మోహన్ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించారు అట్లీ. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

అట్లీ ఇన్‌స్టాలో షేర్‌చేస్తూ..'అవును వారు చెప్పింది నిజమే. ప్రపంచంలో దీన్ని మించిన ఆనందం మరెక్కడా లేదు. మాకు మగబిడ్డ జన్మించారు. ఈ విషయాన్ని అనౌన్స్‌ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా బిడ్డకు మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నా. ' అంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

కాగా.. కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న అట్లీ- ప్రియ దంపతులు 2014లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత బిడ్డ జన్మించడంతో వారి ఇంట్లో ఎక్కడా లేని సంతోషం నెలకొంది.  ఇక సినిమాల విషయానికి వస్తే.. నయనతార, నాజ్రియా, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించిన రాజారాణి సినిమాతో స్టార్‌ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు అట్లీ. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్‌ హిట్‌ అయ్యింది. ప్రస్తుతం షారుక్‌ ఖాన్‌తో 'జవాన్‌'  సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌తో సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది. 

Videos

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?

మహానాడు వాయిదా వేస్తే కరోనాను అరికట్టినవారవుతారు

తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్ చల్

బాబు, పవన్ ను పక్కన పెట్టిన లోకేష్

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)