Breaking News

సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది!: రాజ్‌ పిన్ని

Published on Sat, 12/06/2025 - 15:18

హీరోయిన్‌ సమంత, దర్శకుడు రాజ్‌ నిడిమోరు ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కోయంబత్తూరులోని ఈషా సెంటర్‌లో భూతశుద్ధి పద్ధతిలో వీరి పెళ్లి ఎంతో సింపుల్‌గా జరిగింది. ఈ వివాహం గురించి సంగీత విద్వాంసురాలు శోభారాజు మాట్లాడారు. ఈమె ఎవరంటే.. అన్నమాచార్య సంకీర్తనలతో పాటు సంగీత దర్శకురాలిగా మంచి పేరు గడించింది డాక్టర్‌ శోభారాజు. 

శోభారాజు రియాక్షన్‌
2010లో ఈమెను పద్మశ్రీ పురస్కారం వరించింది. ఈమెకు రాజ్‌ నిడిమోరు బంధువవుతాడు. శోభారాజు అక్క రమాదేవి కొడుకే రాజ్‌ నిడిమోరు. కోడలి వరసయ్యే సమంత గురించి శోభారాజు మాట్లాడుతూ.. ఒక ఆధ్యాత్మిక పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. ఆశ్రమంలో స్వామివారి ఆధ్వర్యంలో ఈ వివాహ వేడుక జరిగింది. రాజ్‌ అంటే నాకు చాలా ఇష్టం. 

చిన్నప్పటి నుంచే..
వాడు చిన్నగా ఉన్నప్పుడే ముద్దుగారే యశోద.. వంటి పాటలు నేర్చుకుని పాడేవాడు. మీ పిన్ని పేరు నిలబెట్టావని అందరూ వాడిని మెచ్చుకునేవాళ్లు. అది నాకు చాలా సంతోషంగా అనిపించేది. తను సంగీతం నేర్చుకుని ఎన్నో పాటలు పాడాడు. వాడికి స్పిరిచ్యువాలిటీ ఎక్కువ. సమంతకు కూడా ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తి ఉందని తెలిసింది.

పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది
ఓ రెండుసార్లు తను వచ్చినప్పుడు చూశాను, చాలా సన్నగా ఉంది. తన పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది. సన్నగా అవాలంటే ఎలా? అని అడిగినప్పుడు ఏవో ఎక్సర్‌సైజ్‌లు చెప్పింది, కానీ నేను చేయలేనన్నాను. తను మూడు నెలలకోసారి ఈషా ఆశ్రమానికి వెళ్లి మౌనం పాటిస్తూ సాధన చేస్తుందని తెలిసి సంతోషంగా అనిపించింది. 

బహుమతులు ఏమిచ్చారంటే?
ఎంతో బిజీ నటి అయుండి ఇలా ధ్యానానికి సమయం కేటాయిస్తుందంటే ముచ్చటేసింది. అలాంటి అమ్మాయి రాజ్‌కు దొరకడం హ్యాపీ. సమంత (Samantha Ruth Prabhu) వాడిని మరింత ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తుందని ఆశిస్తుందన్నాను. పెళ్లిలో ఆరోగ్యకరమైన ఆహారమే వడ్డించారు. అలాగే కెమికల్స్‌ వాడని పర్‌ఫ్యూమ్స్‌ కానుకగా ఇచ్చారు అని శోభా రాజు చెప్పుకొచ్చారు. 

చదవండి: పవన్‌ కల్యాణ్‌.. బిగ్‌బాస్‌ చరిత్ర తిరగరాయనున్నాడా?

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)