Breaking News

అల్లు అర్జున్, ఎన్టీఆర్.. మధ్యలో త్రివిక్రమ్?

Published on Thu, 12/25/2025 - 12:40

ఒకరు చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం ఇండస్ట్రీలో కొత్తేం కాదు. ఒకసారి వేరే హీరో అనుకున్న తర్వాత లేదు లేదు మళ్లీ పాత హీరోతోనే మూవీ చేయడం లాంటివి మాత్రం అరుదుగా జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్‌లో అదే జరగనుందని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. తద్వారా అల్లు అర్జున్, ఎన్టీఆర్, త్రివిక్రమ్ మరోసారి హాట్ టాపిక్ అయిపోయారు. ఇంతకీ ఏంటి విషయం?

అల్లు అర్జున్‌ దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో లాంటి హిట్స్ పడ్డాయి. అలా వీళ్లిద్దరూ కలిసి మరో ప్రాజెక్ట్ చేయబోతున్నారని ఏడాది-ఏడాదిన్నర క్రితం తెగ మాట్లాడుకున్నారు. అదో భారీ మైథలాజికల్ సబ్జెక్ట్ అనే టాక్ బయటకొచ్చింది. లెక్క ప్రకారం 'పుష్ప 2' తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌తో ఈ మూవీ చేస్తారని అంతా అనుకున్నారు. కట్ చేస్తే తమిళ దర్శకుడు అట్లీతో బన్నీ తన కొత్త మూవీ అనౌన్స్ చేశాడు. మరోవైపు త్రివిక్రమ్ కూడా తారక్‌తో ఈ ప్రాజెక్ట్ చేస్తారని న్యూస్ బయటకొచ్చింది.

(ఇదీ చదవండి: 'దండోరా' సినిమా రివ్యూ)

ఇందుకు తగ్గట్లే ఎన్టీఆర్ కూడా 'ద గాడ్ ఆఫ్ వార్' పుస్తకం పట్టుకుని ఒకటి రెండుసార్లు కనిపించాడు. నిర్మాత నాగవంశీ కూడా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో భారీ ఎ‍త్తున ఈ సినిమా ఉండబోతుందన్నట్లు పరోక్షంగా ట్వీట్స్ చేశాడు. తాజాగా ఓ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడిన నిర్మాత బన్నీ వాసు.. కొన్ని సందర్భాల్లో సినిమాలు చేతులు మారుతుంటాయని అన్నాడు. ఇది బన్నీ-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసమేనని నెటిజన్ల అంటున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో కొత్త మూవీస్ ఏం లేవు. అట్లీది వేసవికల్లా పూర్తవుతుంది. మరోవైపు లోకేశ్ కనగరాజ్‌తోనూ బన్నీ డిస్కషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు త్రివిక్రమ్ పేరు కూడా వినిపిస్తోంది. మరి ఈ ఇద్దరు దర్శకుల్లో బన్నీతో చేసేవారిలో ఎవరు ముందు ఎవరు వెనక అనేది చూడాలి? పరిస్థితులు చూస్తుంటే త్రివిక్రమ్.. మరోసారి తారక్‌కి హ్యాండ్ ఇచ్చాడా అనిపిస్తుంది. గతంలో 'ఆర్ఆర్ఆర్' తర్వాత కూడా ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ మూవీ ప్రకటించారు. కానీ దాన్ని పట్టాలెక్కించలేకపోయారు.

(ఇదీ చదవండి: 17 ఏళ్లకే తల్లి పాత్ర.. 'ఛాంపియన్'తో ఇ‍ప్పుడు తెలుగులోకి.. ఎవరీ అనస్వర)

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)