ఇది ఉత్తరాది-దక్షిణాది మధ్య యుద్ధం కాదు అంతకు మించి

Published on Sun, 02/22/2026 - 15:00

సంక్రాంతి తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర సౌండ్ లేదు. అయితే మార్చిలో 'ధురంధర్ 2', టాక్సిక్ లాంటి భారీ పాన్ ఇండియన్ మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటి గురించి సగటు ప్రేక్షకుడు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. మరోవైపు ఈ చిత్రాల మధ్య పోటీ గురించి.. ప్లస్ మైనస్సుల గురించి దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో విశ్లేషించాడు. ఈ మేరకు ట్విటర్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

'నేను కేవలం రెండు పెద్ద సినిమాల గురించి మాట్లాడటం లేదు. భారతీయ సినీ చరిత్రలో ముందెన్నడూ చూడని ఓ భీకర యుద్ధాన్ని చూడబోతున్నాం. ఇది డేవిడ్, గోలియత్ మధ్య జరుగుతున్న పోరాటం. గతంలో 'కేజీఎఫ్ 2' సాధించిన భారీ వసూళ్లు.. 'ధురంధర్' ముందు చిన్నవిగా అనిపించాయి. ఇప్పుడు 'ధురంధర్ 2' అనే డేవిడ్ ముందు 'టాక్సిక్' అనే గోలియత్ నిలబడింది. ధురంధర్ మేకర్స్.. ప్రేక్షకుల తెలివితేటలని గౌరవిస్తున్నారు. 'టాక్సిక్' మేకర్స్ మాత్రం ప్రేక్షకుల్ని మూర్ఖులని భ్రమపడుతున్నారు' అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. అలానే కొన్ని పాయింట్స్ కూడా దేనికదే చెప్పుకొచ్చాడు.

హీరోయిజం: గుడ్డిగా హీరోని ఆరాధించడం ఓవైపు ఉంటే, కథలోని నైతిక విలువల ద్వారా హీరోని ప్రేక్షకులని అభిమానించడం మరోవైపు.
యాక్షన్: గాలిలో ఎగిరే స్టంట్స్, న్యూటన్ ఫార్ములాని వెక్కిరించే ఫైట్స్ 'టాక్సిక్'లో ఉంటే.. ఒళ్లు గగుర్పొడితే సహజ యాక్షన్ 'ధురంధర్' సొంతం
మ్యూజిక్: ప్రతి ఐదు నిమిషాలకు విజిల్స్ వేయించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటైతే, నటనకు అవకాశమిస్తూ నిశ్శబ్దంగా సాగే సంగీతం మరోవైపు

కేవలం ఓ నటుడిని దేవుడిలా చూపించడానికి రూ.700 కోట్లు ఖర్చు చేయడం కంటే ప్రతి పాత్రని మనిషిలా చూపించడానికి రూ.130 కోట్లు ఖర్చు చేయడం గొప్ప. ప్రేక్షకులని పిల్ల‍లనుకుని ప్రతిదీ వివరించి చూపించడం మానేయాలి. క్లిష్టంగా ఉండే స్టోరీలని కూడా అర్థం చేసుకోగలరని 'ధురంధర్' నిరూపించింది. అయితే ఇదంతా కూడా ఆదిత్య ధర్ మీద ప్రేమతో రాయడం లేదు. మన సినిమాపై ఉన్న ఆశతో రాస్తున్నాను. మార్చి 19న మన దేశం.. ధురంధర్ 2ని ఎంచుకుంటుందో లేదా టాక్సిక్ మాస్ మత్తులో పడుతుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రాంగోపాల్ రాసుకొచ్చాడు.

ఈ ట్వీట్ చూసిన చాలామంది.. 'ధురంధర్ 2'ని పొగుడుతూ 'టాక్సిక్'ని తక్కువ చేశాడా అని మాట్లాడుకుంటున్నారు. దీంతో ఆర్జీవీ మరో ట్వీట్ చేశాడు. తాను సినిమాల గురించి మాట్లాడట్లేదని.. స్టైల్ ఆఫ్ మూవీస్ గురించి ప్రస్తావించానని క్లారిటీ ఇచ్చాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)