Breaking News

దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట్లో వరస విషాదాలు

Published on Wed, 07/22/2026 - 10:19

టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట్లో వరస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్తని కోల్పోయిన ఈయన.. ఇప్పుడు తన సోదరి చనిపోయిన విషయాన్ని వెల్లడించాడు. తన చిన్నక్క జ్యోతి గత 14 రోజులుగా న్యూమోనియాకి చికిత్స తీసుకుంటూ మంగళవారం రాత్రి ప్రాణాలు విడిచారని పోస్ట్ పెట్టాడు.

(ఇదీ చదవండి: రష్మిక కోసం సుకుమార్ సెంటిమెంట్ బ్రేక్?)

'నా ప్రియమైన చిన్నక్క మెహర్ జ్యోతి సుంకర ఈ రోజు రాత్రి 9:45 గంటలకు విజయవాడలో స్వర్గస్తులయ్యారు. వైరల్ న్యూమోనియాతో గత 14 రోజులుగా చికిత్స పొందుతూ ‍అనంత లోకాలకు వెళ్లిపోయారు. నా చిన్నప్పటి నుంచి తను నా అండ. ప్రేమగా నా కూతురి పెళ్లి దగ్గరుండి జరిపించి శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమల దర్శనం చేసుకుని ఎంతో ఆనందపడిన మా అ‍క్క ఇప్పుడు ఆ దేవుడి దగ్గరకు ఇంత తొందరగా వెళ్లిపోవడం మా కుటుంబానికి తీరని లోటు' అని మెహర్ రమేశ్ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.

2023లో మెహర్ రమేశ్ తల్లి చనిపోగా, గతేడాది మార్చిలో అక్క కన్నుమూశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్త మృతి చెందగా ఇప్పుడు చిన్నక్కని కోల్పోయిన సంగతి ఈ దర్శకుడు బయటపెట్టారు. ఇలా మెహర్ రమేశ్ ఇంట్లో వరస విషాదాలు చోటుచేసుకున్నాయి. ఇకపోతే గత నెల ప్రారంభంలోనే మెహర్ రమేశ్ కుమార్తె పెళ్లి జరిగింది. ఈ దర్శకుడు చివరగా 2023లో వచ్చిన 'భోళా శంకర్' తీశారు. అప్పటినుంచి మరో ప్రాజెక్ట్ చేయలేదు.

(ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలనటి దుర్మరణం)

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)