కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్
Breaking News
ఆమె పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది: డైరెక్టర్
Published on Wed, 06/29/2022 - 11:11
Director Garudavega Anji About 10th Class Diaries Movie: ‘‘టెన్త్ క్లాస్ డైరీస్’లో ఎమోషన్, యాక్షన్, డ్రామా అన్నీ ఉన్నాయి. మా నిర్మాత అచ్యుత రామారావు, ఆయన స్నేహితుల జీవితంలో జరిగిన కథ ఇది. ఆయన కథ చెప్పాక స్క్రీన్ ప్లే రాసి సినిమాటిక్‌గా తీశాం’’ అని దర్శకుడు ‘గరుడ వేగ’ అంజి తెలిపారు. అవికా గోర్, శ్రీరామ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అజయ్ మైసూర్ సమర్పణలో అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం నిర్మించిన ఈ సినిమా జూలై 1న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ‘గరుడవేగ’ అంజి మాట్లాడుతూ.. ‘‘మా స్నేహితుల్లో ఒక అమ్మాయి ప్రేమించిన అబ్బాయి కోసం పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది’ అని అచ్యుత రామారావుగారు చెప్పారు. ఆ పాయింట్ నాలో స్ఫూర్తి నింపడంతో దర్శకత్వం వైపు వచ్చాను. ఛాయాగ్రాహకుడిగా నాకు 50వ చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. దాసరి నారాయణరావు, రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకుల దగ్గర నేను నేర్చుకున్నది, నేను పని చేసిన 40మంది దర్శకుల అనుభవం దర్శకుడిగా నాకు ‘టెన్త్ క్లాస్ డైరీస్’కి ఉపయోగపడింది. డైరెక్టర్‌గా నా రెండో చిత్రం ‘బుజ్జి ఇలా రా’ రిలీజ్‌కు రెడీగా ఉంది. కెమెరామెన్‌గా ఒక మలయాళ సినిమా కమిట్ అయ్యాను’’ అని పేర్కొన్నారు.
చదవండి: మరోసారి తండ్రి అయిన నిర్మాత దిల్ రాజు..
ఒకే ఫ్రేమ్‌లో టాలీవుడ్ ప్రముఖులు.. అమితాబ్ ఆసక్తికర పోస్ట్
తెరపైకి అటల్ బిహారీ వాజ్‌పేయి జీవిత కథ..
Tags : 1