Breaking News

'డ్రాగన్' షూటింగ్ లో ప్రేమ.. ఇప్పుడు ఏకంగా పెళ్లి

Published on Mon, 05/19/2025 - 16:51

ప్రేమ.. ఎప్పుడు ఎవరిపై ఎందుకు పుడుతుందో చెప్పడం కష్టం. అలా ప్రేమలో పడ్డ వాళ్లు కొందరు సులభంగా పెళ్లిపీటలు ఎక్కుతారు. మరికొందరు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొని ఒక్కటవుతుంటారు. అలా ఇప్పుడు నిజంగా జరిగిన ఓ ప్రేమకథని దర్శకుడు అశ్వత్ మారిముత్తు బయటపెట్టాడు. రీసెంట్ గా 'రిటర్న్ ఆఫ్ డ్రాగన్' సినిమా తీసింది ఇతడే.

(ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి.. త్వరలోనే ముహుర్తం ఫిక్స్!)

'ఓ మై కడవులే' ‍అనే తమిళ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అశ్వత్.. దీన్ని తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా 'ఓరి దేవుడా' పేరుతో రీమేక్ చేశారు. అలా తెలుగులోనూ అశ్వత్ మూవీ తీశాడు. రీసెంట్ గా ప్రదీప్ రంగనాథన్ హీరోగా 'రిటర్న్ ఆఫ్ డ్రాగన్' తీసి సూపర్ హిట్ కొట్టేశాడు. అయితే ఈ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసిన విక్కీ .. ఇదే మూవీకి మేకప్ ఆర్టిస్టుగా పనిచేసిన పవిత్ర రుక్మిణి ఆదివారం నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు హాజరైన అశ్వత్.. వీళ్లిద్దరి ప్రేమకథ గురించి చెప్పాడు.

'నిన్న నాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే నా అసిస్టెంట్ డైరెక్టర్ విక్కీ.. పవిత్రతో నిశ్చితార్థం చేసుకున్నాడు. 'ఓ మై కడవులే' సినిమా కోసం విక్కీ నా దగ్గర అసిస్టెంట్ గా చేరాడు. 'డ్రాగన్'కి చీఫ్ అసోసియేట్ దర్శకుడిగా పనిచేశాడు. నాతో పాటే కలిసి ఉండేవాడు. కానీ కొన్నిసార్లు జీవితం మనల్ని సర్ ప్రైజ్ చేస్తూ ఉంటుంది. అలా విక్కీ.. 'డ్రాగన్' సెట్ లో మేకప్ ఆర్టిస్ట్ పవిత్రని కలిశాడు. చూడగానే ప్రేమలో పడిపోయాడు'

'ప్రతి గొప్ప ప్రేమకథ.. నో చెప్పడంతోనే మొదలవుతుంది. వీళ్లది కూడా అంతే. బ్రేకప్ సీన్ తీస్తున్న టైంలో విక్కీ ఏడుస్తూ కనిపించాడు. ఏమైందని అడిగితే.. తను నో చెప్పింది, మాట్లాడొద్దని కూడా చెప్పిందని అన్నాడు. ఓ అన్నగా నేను కొన్ని సలహాలు ఇచ్చా. కానీ పాట తీస్తున్న టైంకల్లా వాళ్ల గాఢమైన ప్రేమలో ఉన్నారు. రీసెంట్ గా నా దగ్గరకొచ్చి.. మేం పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పడంతో నేను షాకయ్యాను' అని అశ్వత్ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)