Breaking News

ఓటీటీలోకి మలయాళ హారర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Published on Fri, 11/28/2025 - 19:24

దెయ్యం సినిమాలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి గానీ వాటిలో భయపెట్టేవి చాలా తక్కువ. రీసెంట్‌గా మలయాళంలో రిలీజైన ఓ మూవీ.. హారర్ చిత్రాలంటే ఇష్టపడే ప్రేక్షకుల్ని కూడా భయపెట్టింది. థియేటర్లలో ఆకట్టుకుని మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఓటీటీలోనూ వణికించేందుకు సిద్ధమైపోయింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో చూడొచ్చు?

మలాయళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ కూడా అడపాదడపా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ టైంలో 'డీయస్ ఈరే' అనే హారర్ చిత్రంలో నటించాడు. 'భూతకాలం', 'భ్రమయుగం' తదితర మూవీస్‌తో ప్రేక్షకుల్ని భయపెట్టిన రాహుల్ సదాశివన్.. ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.  అక్టోబరు 31న మలయాళంలో, నవంబరు 7న తెలుగు వెర్షన్.. థియేటర్లలో రిలీజైంది. ఓవరాల్‌గా రూ.80 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన 20 మూవీస్)

థియేటర్లలో అలరించిన 'డీయస్ ఈరే' సినిమా.. ఇప్పుడు డిసెంబరు 05 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. మీరు హారర్ మూవీ లవర్స్ అయితే గనుక దీన్ని అస్సలు మిస్ చేయొద్దు. చిల్ మూమెంట్స్ ఇచ్చే సీన్స్ చాలానే ఉంటాయి.

'డీయస్ ఈరే' విషయానికొస్తే.. రోహన్ (ప్రణవ్ మోహన్‌లాల్) ఓ ఆర్కిటెక్ట్. బాగా డబ్బున్న ఫ్యామిలీ కుర్రాడు. తల్లిదండ్రులు అమెరికాలో ఉంటారు. ఇతడేమో ఇక్కడ పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. ఖాళీ టైంలో పార్టీలు, ఫ్రెండ్స్ అని ఎంజాయ్ చేస్తుంటాడు. ఓ రోజు రోహన్ క్లాస్‌మేట్ కని(సుస్మితా భట్) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. దీంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు రోహన్, అతడి ఫ్రెండ్.. కని ఇంటికి వెళ్లొస్తారు. అప్పటినుంచి రోహన్ ఇంట్లో రాత్రిపూట వింతైన శబ్దాలు వినిపిస్తుంటాయి. కని ఆత్మనే తనని వేధిస్తోందని రోహన్ భయపడుతుంటాడు. ఇంతకీ ఆ ఆత్మ ఎవరిది? రోహన్ వెంటే ఎందుకు పడుతోంది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: Dies Irae: సౌండ్‌తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ)

(ఇదీ చదవండి: తెలుగు కామెడీ థ్రిల్లర్‌.. వారం రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)