Breaking News

బాక్సాఫీస్ వద్ద దురంధర్‌ క్రేజ్.. ఆ ట్యాగ్ బాగా కలిసొచ్చిందా?

Published on Mon, 12/22/2025 - 17:05

ఈ ఏడాది కాంతారా చాప్టర్-1 రిషబ్ శెట్టిదే హవా అనుకున్నాం. ఆ మూవీనే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డ్‌ చెదరదని ఫిక్సయిపోయాం. అంతేకాకుండా విక్కీ కౌశల్ ఛావాను కొట్టే చిత్రం ఈ ఏడాది బాలీవుడ్‌ రావడం కష్టమే అనుకున్నాం. మరికొద్ది రోజుల్లోనే ఈ సంవత్సరం ముగియనుందగా.. ఆ రెండు రికార్డ్స్‌ చెక్కు చెదరవని ఈ సినిమాలు తీసినవాళ్లు సైతం అనుకునే ఉంటారు. కానీ పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ను ఓ రేంజ్‌లో షేక్ చేస్తోంది ఆ సినిమా. డిసెంబర్‌ 5 తేదీకున్న మహిమో.. ఏమో గానీ ఈ ఏడాది బాక్సాఫీస్ లెక్కలను మాత్రం తారుమారు చేస్తూ దూసుకెళ్తోంది. ఇంతకీ ఆ సినిమాకు ఎందుకింత సక్సెస్‌ అయింది.. అదే ఈ సినిమాకు ప్లస్‌గా మారిందా? అనేది తెలుసుకుందాం.

ఈ రోజుల్లో సినిమాలకు భారీ కలెక్షన్స్ రావడమంటే మామూలు విషయం కాదు. ఓటీటీలు వచ్చాక చాలామంది థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. పెద్ద పెద్ద స్టార్స్ ఉంటే తప్ప థియేటర్స్‌ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక చిన్న సినిమాలైతే అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఎలాంటి బజ్‌ లేకుండా వచ్చిన దురంధర్ మాత్రం బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. డిసెంబర్‌ 5న రిలీజైన ఈ చిత్రం 17 రోజుల్లోనే రూ.845 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.  ఈ ఏడాది అత్యధిక వసూళ్ల లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్న ఛావాను అధిగమించింది. ఇక మరో ఏడు కోట్లు వస్తే చాలు కాంతార చాప్టర్-1 రికార్డ్ బ్రేక్‌ చేయనుంది. సైలెంట్‌గా వచ్చిన ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇంతలా దూసుకెళ్లడానికి కారణాలేంటి? గతంలో ఇలాంటి జోనర్‌లో చాలా సినిమాలు వచ్చినా దురంధర్‌ క్రేజ్‌ అందుకోలేకపోయాయి. కేవలం హిందీలో విడుదలై ప్రభంజనం సృష్టించడానికి అదొక్కటే ప్రధాన కారణమా? అనేది తెలుసుకుందాం.

సాధారణంగా స్పై, గూఢచారి సినిమాలు యుద్ధాల నేపథ్యంలో తెరకెక్కిస్తుంటారు. వీటిలో కొన్ని ఫిక్షనల్.. అలాగే మరికొన్ని రియల్ వార్స్‌ కూడా ఉంటాయి. అలా వచ్చిన దురంధర్‌ డైరెక్టర్‌ కూడా పాకిస్తాన్‌ నేపథ్యంగా కథను ఎంచుకున్నారు. అక్కడ ఓ ప్రాంతంలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌ ఆధారంగా దురంధర్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఆదిత్య ధార్. ఈ మూవీలో భారతీయ ఏజెంట్ అయిన హంజా పాత్రలో రణ్‌వీర్‌ సింగ్ నటించారు. పాకిస్తాన్‌ టార్గెట్‌గా ఈ మూవీని తెరకెక్కించడం దురంధర్‌కు బాగా కలిసొచ్చినట్లు తెలుస్తోంది. 

హృతిక్ రోషన్ విమర్శలు..

బాలీవుడ్ స్టార్‌ హీరో అయిన హృతిక్ రోషన్‌ ఈ సినిమాను పొగుడుతూనే విమర్శించారు. అంతా బాగుంది కానీ.. రాజకీయపరమైన అంశాలను చూపించడం తనకు నచ్చలేదంటూ మాట్లాడారు. ఆ తర్వాత చాలామంది ఈ మూవీని ప్రాపగండ సినిమా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఏకంగా బీజేపీ ప్రాపగండ మూవీ అంటూ ఆరోపించారు. ఇదే దురంధర్‌కు మరింత ప్లస్‌గా మారింది. సాధారణంగా పాజిటివ్‌ కంటే నెగెటివ్‌కే ఎక్కువ పవర్‌ ఉంటుందని దురంధర్‌తో నిజమైంది. ప్రాపగండ ట్యాగ్‌ ముద్ర వేయడం కూడా దురంధర్‌కు కలెక్షన్స్‌ పెరిగేందుకు మరింత ఉపయోగిపడిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్‌లో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ పార్ట్- 2 మార్చి 2026లో విడుదల కానుంది.
 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)