Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..
Breaking News
రూ.33 కోట్లు పెట్టి ఇల్లు కొన్న 'ధురంధర్' విలన్.. స్పెషలేంటి?
Published on Tue, 09/29/2026 - 13:35
మనలో ఎంత టాలెంట్ ఉన్నాసరే దానికంటూ ఓ టైమ్ రావాల్సి ఉంటుంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా విషయంలో ఇదే జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో హీరోగా, సహాయ నటుడిగా పలు సినిమాలు చేసినప్పటికీ హిందీ వరకే ఇతడి పేరు తెలుసు. ఎప్పుడైతే 'ధురంధర్'లో విలన్గా చేశాడో ఇతడి దశ తిరిగిపోయింది. ఓవరనైట్ స్టార్డమ్ వచ్చేసింది. ప్రస్తుతం పలు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న ఇతడు.. ఇప్పుడు కోట్లాది రూపాయలు విలువ చేసే ఇల్లు కొన్నాడు. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'అక్క'.. లేడీ గ్యాంగ్స్టర్గా కీర్తి సురేశ్)
ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన మలబార్ హిల్లో అక్షయ్ ఖన్నా.. ఓ లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేశాడు. దీని విలువ రూ.33.26 కోట్లు. ఈ నెలలోనే రిజిస్ట్రేషన్ అంతా పూర్తయింది. మలబార్ హిల్ రోడ్డులోని 30 లిటిల్ గిబ్స్లో ఈ అపార్ట్మెంట్ ఉంది. మరి ఇన్ని కోట్లు పెట్టి కొన్ని దీనిలో స్పెషల్ ఏంటి అని అంటారా?
దక్షిణ ముంబైలోని అత్యంత ప్రతిష్ఠాత్మక నివాస ప్రాంతాల్లో మలబార్ హిల్ కూడా ఒకటి. సముద్రం కనిపించేలా ఫేసింగ్, చాలామంది సెలబ్రిటీలు, సంపన్నులకు ఇది ఫేవరెట్ రెసిడెన్షియల్ లొకేషన్ ఇది. మెరైన్ డ్రైవ్, నరీమన్ పాయింట్, కొలాబా లాంటి ప్రాంతాలకు ఇది దగ్గరగా ఉంటుంది. అందుకే ఇంత ధర అని తెలుస్తోంది.
అక్షయ్ ఖన్నా విషయానికొస్తే.. దిగ్గజ నటుడు వినోద్ ఖన్నా కొడుకు. దిల్ చాహ్తా హై, హమ్రాజ్, హుల్చుల్, గాంధీ, మై ఫాదర్, రేస్, దృశ్యం తదితర సినిమాల్లో డిఫరెంట్ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ టైంలో అయితే ఛావా, ధురంధర్ సినిమాలతో వావ్ అనిపించాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం పర్యవేక్షణలో తీస్తున్న 'మహాకాళి'లో అసురగురువు శుక్రాచార్యగా కనిపించబోతున్నాడు. వచ్చే ఏడాది జనవరి 8న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇకపోతే ఇతడు ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.20 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట.
(ఇదీ చదవండి: 'బిగ్బాస్'కి పోటీగా కొత్త రియాలిటీ షో.. లాంచింగ్ ప్రోమో)
Tags : 1