అవమానించారు.. జోకర్ లా చూశారు! మీరు డాక్టర్ కాదు.. కనిపించే దేవుడు
Breaking News
'ధురంధర్ 2'.. ఇంత పొరపాటు ఎలా చేశారు?
Published on Sun, 03/22/2026 - 17:47
ప్రస్తుతం భారతీయ బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్ 2' హవా కనిపిస్తోంది. పేరుకే హిందీ సినిమా అయినప్పటికీ డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరిస్తోంది. దీని ప్రభావమో ఏమో గానీ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కలెక్షన్స్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయాయి. అయితే 'ధురంధర్ 2' చూసి చాలామంది ఎంజాయ్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రొపగాండా మూవీ అని విమర్శిస్తున్నారు. వీటి సంగతి కాసేపు పక్కనబెడితే మూవీలో ఓ పొరపాటు మాత్రం అలానే వదిలేశారు. దీన్ని ఇప్పుడు నెటిజన్లు కనిపెట్టారు.
(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?)
గతేడాది డిసెంబరులో 'ధురంధర్' తొలి భాగం రిలీజ్ కాగా.. ఈ శుక్రవారం(మార్చి 19) సీక్వెల్ విడుదలైంది. ప్రమోషన్స్ ఏం లేకపోయేసరికి వాయిదా పడుతుందేమో అని చాలామంది అనుకున్నారు. కానీ చెప్పిన తేదీకే థియేటర్లలోకి వచ్చారు. కాకపోతే తెలుగు వెర్షన్ మాత్రం రెండు రోజులు ఆలస్యంగా అంటే నిన్నటి(మార్చి 21) నుంచి అందుబాటులోకి తెచ్చారు.
అసలు విషయానికొస్తే ఈ మూవీ ఇంటర్వెల్ సీన్‌లో హీరో, పిండా అనే పాత్రధారి మధ్య బాత్రూమ్‌లో చిన్నపాటి ఫైట్ సీన్ జరుగుతుంది. మూవీలో ఈ సన్నివేశం చాలామందికి ఆకట్టుకున్నప్పటికీ.. అద్దంలో కెమెరామ్యాన్ కూడా కనిపిస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విటర్‌లో వైరల్ అవుతోంది. ఈ పొరపాటు అసలు మేకర్స్ చూసుకోలేదా అని మాట్లాడుకుంటున్నారు. అయితే చెప్పిన తేదీన రిలీజ్ చేయాలనే హడావుడిలో దీన్ని మర్చిపోయింటారేమో అని మాట్లాడుకుంటున్నారు.
'ధురంధర్ 2' కలెక్షన్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం రూ.500 కోట్ల మార్క్ దాటేసినట్లు తెలుస్తోంది. అలానే ఓవర్సీస్‌లోనూ 16 మిలియన్ డాలర్లు సాధించినట్లు టాక్. తొలి భాగంలానే ఇది కూడా లాంగ్ రన్‌లో మరిన్ని వందల కోట్లు సొంతం చేసుకునేలా కనిపిస్తుంది. మరి 'ధురంధర్ 2' రచ్చ.. ఎన్ని వందల కోట్ల దగ్గర ఆగుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: క్రికెట్ రాజకీయాలకు బలైన 'ధురంధర్' దర్శకుడు)
A Cameraman showing in this scene.
Peak Detailing by Aditya Dhar
Damm 🤣#Dhurandhar2 #DhurandherTheRevenge pic.twitter.com/LDjDG8nReP— Sunil Goriya (@Sunil_Goriya) March 21, 2026
Tags : 1