'నా భార్యను మోసం చేయలేదు'.. దురంధర్ నటుడు కామెంట్స్

Published on Mon, 06/08/2026 - 18:40

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌, బ్లాక్‌బస్టర్‌ మూవీ దురంధర్‌. ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ది రివెంజ్‌ సైతం బాక్సాఫీస్‌ను షేర్ చేసింది. ఈ చిత్రాలకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా.. ఆర్ మాధవన్ కీలక పాత్రలో మెప్పించారు. ఈ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

తాజాగా ఇవాళ తన పెళ్లి రోజు కావడంతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ ఛానెల్‌ ఇంటర్వ్యుకు హాజరైన మాధవన్ తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడారు. ఎంతోమంది అందమైన హీరోయిన్లతో తాను పనిచేశానని వెల్లడించారు. అయితే ఎప్పుడు తాను ఎవరితో రిలేషన్ పెట్టుకోలేదన్నారు. ఈ విషయంలో తన వైఫ్‌ను ఎప్పుడు మోసం చేయలేదని తెలిపారు. ఎందుకంటే తన జీవితంలో వైవాహిక బంధానికి ఎక్కువ విలువ ఇస్తానని మాధవన్ వెల్లడించారు.

కుటుంబంతో సంతోషంగా ఉండాలనేదే తనకిష్టమని ఆర్ మాధవన్ తెలిపారు. ఇదంతా తాను పాత తరం నుంచే నేర్చుకున్నానని.. సతీమణితో విధేయతగా ఉండడం మా బ్లడ్‌లోనే ఉందన్నారు. షూటింగ్‌ పూర్తికాగానే ఇంటికి వెళ్లి నా భార్యను హత్తుకున్నప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుందని వెల్లడించారు. ఎందుకంటే నేను భార్యకు భయపడే మధ్యతరగతి వ్యక్తినన సరదాగా మాట్లాడారు. తన భార్య సరితనే ఇంట్లో ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకుంటారని వెల్లడించారు. తన ఫోన్‌, బ్యాంక్‌ లావాదేవీలు కూడా ఆమెనే చూస్తుంటారని పంచుకున్నారు. కాగా..  1993లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆర్ మాధవన్‌.. 1999లో సరితను వివాహం చేసుకున్నారు.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)