విక్రమ్ తనయుడి బైసన్.. ఓటీటీకి వచ్చేది ఆ రోజే!

Published on Mon, 11/10/2025 - 21:47

కోలీవుడ్ స్టార్ విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా నటించిన చిత్రం బైసన్. ఇటీవలే దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీని కబడ్డీ బ్యాక్‌ డ్రాప్‌లో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాను ఓ వారం రోజుల గ్యాప్ తర్వాత అక్టోబర్ 24న తెలుగులోనూ విడుదల చేశారు. ఇక్కడ కూడా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ కోసం ధ్రువ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ చిత్రం నవంబర్ 21 నుంచి డిజిటల్‌గా అందుబాటులోకి రానుందని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ నెలలోనే నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. 

కాగా.. ఈ చిత్రంలో హీరో అక్కగా రజిషా విజయన్‌, ఆయన తండ్రిగా పశుపతి, హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ నటించారు. వీరితో పాటు దర్శకుడు అమీర్‌, లాల్‌ ముఖ్యపాత్రలు పోషించారు. నివాస్‌ కే.ప్రసన్న సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్‌న్స్‌, అప్లాజ్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. ఒక కుగ్రామానికి చెందిన పేద కుర్రాడు అత్యున్నత పురస్కారం అర్జున్‌ అవార్డును గెలుచుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అనే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రమే బైసన్. 

 

Videos

నువ్వే పెద్ద కల్తీ.. సుప్రీం తిట్టినా బుద్ధి మారదా!

Watch Live: జూబ్లీహిల్స్ బైపోల్ లైవ్ అప్ డేట్

ఏపీ ఇక సూడాన్.. 17 నెలల్లో బాబు చేసిన అప్పు

షుగర్ పేషెంట్స్ కు రియల్ గుడ్ న్యూస్

తెలంగాణలో మరో బస్సు ప్రమాదం

ఉగ్రవాదుల అరెస్ట్.. మరుసటి రోజే బాంబు బ్లాస్ట్..

ఢిల్లీలో భారీ పేలుడు.. హైదరాబాద్ హై అలర్ట్

బాంబు బ్లాస్ట్ పై అమిత్ షా ఫస్ట్ రియాక్షన్

Religious Leader: మీ హస్తం లేకుండానే గోవుల అక్రమ రవాణా జరుగుతుందా?

Ambati: ఆ భగవంతుడు వదలడు

Photos

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఢిల్లీ ఎర్రకోట సిగ్నల్‌ వద్ద భారీ పేలుడు (చిత్రాలు)

+5

తెలుగమ్మాయి ఆనంది గ్లామరస్ ఫొటోలు

+5

కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

నాథ్‌ద్వారా కృష్ణుడి ఆలయంలో ముకేశ్‌ అంబానీ (ఫొటోలు)

+5

నా హ్యాపీ బర్త్‌డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్‌ (ఫొటోలు)

+5

Ande Sri: ప్రజాకవి అందెశ్రీ అరుదైన (ఫొటోలు)

+5

ట్రెండింగ్ లో రామ్ చరణ్ 'చికిరి చికిరి' పాట డ్యాన్స్ (ఫొటోలు)

+5

ఏపీలో సందడి సందడిగా వనభోజనాలు (ఫొటోలు)

+5

కడప : పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో నటులు సుమన్‌, అలీ (ఫొటోలు)