Breaking News

అర్ధరాత్రి ఇంటికి రీతూ.. తననలాగే చూస్తా! డిప్రెషన్‌లో ఉన్నా: ధర్మ మహేశ్‌

Published on Wed, 09/24/2025 - 11:03

బిగ్‌బాస్‌ హౌస్‌లో రీతూ చౌదరి (Rithu Chowdary) వేసే వేషాలు చూస్తుంటే జనాలకు చిరాకు పుడుతోంది. అయితే డిమాన్‌ పవన్‌, లేదంటే పవన్‌ కల్యాణ్‌తో కూర్చుని కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తూ, ఏదో ప్రేమపక్షుల్లా ప్రవర్తిస్తూ బిగ్‌బాస్‌ హౌస్‌ను పార్క్‌లా మార్చేసింది. కెప్టెన్‌గా పవన్‌ తనను సేవ్‌ చేయకపోయేసరికి హార్ట్‌ బ్రేక్‌ అయిందంటూ బోరున ఏడ్చేసింది. ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నవాడిలా కల్యాణ్‌ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటే చాలు, హత్తుకుని ఓదారుస్తున్నాడు.

భార్యను వదిలి రీతూతో..
చిన్నచిన్నవాటికే కన్నీళ్లుపెట్టుకుంటున్న రీతూ బయట జరుగుతున్న వ్యవహారం చూస్తే ఏమైపోతుందో! హీరో ధర్మ మహేశ్‌ (Dharma Mahesh) వరకట్నం కోసం వేధిస్తున్నాడంటూ అతడి భార్య, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ గౌతమి పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే కదా! అయితే తను గర్భంతో ఉండగా మహేశ్‌.. రీతూతో క్లోజ్‌గా ఉన్నాడని, ఎన్నోసార్లు అర్ధరాత్రి ఇంటికి తీసుకొచ్చాడంటూ సీసీటీవీ వీడియోలు షేర్‌ చేసింది. ఆమె కోసం గర్భవతిని అని కూడా చూడకుండా తనను తోసేశాడని, నరకం చూపించాడంది.

రీతూ, నేను ఫ్రెండ్స్‌
తాజాగా ఈ వ్యవహారంపై ధర్మ మహేశ్‌ స్పందించాడు. ఓ మీడియాతో మాట్లాడుతూ.. నాకు, రీతూకు మధ్య ఏం లేదు. మేమిద్దరం ఫ్రెండ్స్‌ మాత్రమే! తనను ఫ్రెండ్‌లా చూస్తాను. మా బెడ్‌రూమ్‌ ఫుటేజీలు ఉన్నాయంటోంది కదా.. కావాలంటే రిలీజ్‌ చేసుకోమనండి. తను నా కొడుకుని నాకు చూపించడం లేదు. నేను డిప్రెషన్‌లో ఉన్నాను. సెటిల్మెంట్‌ చేస్తే నా కొడుకును చూపిస్తామన్నారు. ఈ గొడవలో నా కొడుకును ఎందుకు లాగుతున్నారు?

ఇల్లు ఖాళీ చేయించింది
ఏడేళ్లు కష్టపడి ఇంతదాకా వస్తే నా పేరును నాశనం చేసింది. తను అన్నీ అబద్ధాలే చెప్తోంది. నేనున్న ఇల్లు కూడా ఖాళీ చేయించింది. నేనుండే ఇంటి యజమానికి నేను డ్రగ్స్‌ వ్యాపారం చేస్తానని అబద్ధం చెప్పింది. దాంతో అతడు భయపడిపోయి ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నాడు. నేను డ్రగ్స్‌ తీసుకోవడం కాదు కదా.. కనీసం వాటిని ఎప్పుడూ చూడలేదు. సరే.. ఆమె విడాకులు కావాలంటోంది కదా.. ప్రశాంతంగా విడిపోదామంటున్నాను. నా కొడుకుని నేనే చూసుకుంటాను అని ధర్మ మహేశ్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: సంజనా హీరోయిన్‌ కాకుండా ప్రియుడి కుట్ర! చివరకు పిచ్చోడై..

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)