Breaking News

ఆకట్టుకునేలా ధనుష్ 'ఇడ్లీ కొట్టు' ట్రైలర్

Published on Sat, 09/20/2025 - 19:40

ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'ఇడ్లీ కొట్టు'. అక్టోబరు 01న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. పూరి గుడిసెలో ఉండే ఓ ఇడ్లీ కొట్టు బ్యాక్ డ్రాప్‌లో సాగే ఓ ఎమోషనల్ జర్నీలా అనిపిస్తుంది. నిత్యామేనన్, అరుణ్ విజయ్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

(ఇదీ చదవండి: 'ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు'.. టాక్ ఏంటి?)

ట్రైలర్ బట్టి చూస్తే మురళి(ధనుష్) తండ్రికి సొంతూరిలో చిన్న ఇడ్లీ కొట్టు ఉంటుంది. అదంటే ఆయనకు ఎంతో ప్రాణం. తండ్రిని చూస్తూ పెరిగిన మురళి.. పెరిగి పెద్దయ్యాక ఓ పెద్ద ఫుడ్ కంపెనీలో జాబ్ సాధిస్తాడు. అక్కడ పనైతే చేస్తుంటాడు గానీ మనసంతా ఊరిలో తమ ఇడ్లీ కొట్టుపైనే ఉంటుంది. తండ్రి తదనంతరం దాన్ని మూసేస్తారు. పెద్ద జాబ్ చేసుకునే మురళి.. ఊరికొచ్చి మళ్లీ తమ ఇడ్లీ కొట్టు ఎందుకు తెరిచాడు? ఈ స్టోరీలో విలన్ ఎవరు? అనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.

సెప్టెంబరు 25న తెలుగులో ఓజీ సినిమా రానుంది. దీనిపై అంచనాలు ఉన్నాయి. అలానే అక్టోబరు 2న పాన్ ఇండియా మూవీ 'కాంతార' సీక్వెల్ రాబోతుంది. ఈ రెండింటికి పోటీగా ధనుష్ 'ఇడ్లీ కొట్టు' చిత్రాన్ని బరిలో దింపుతున్నాడు. ఎమోషనే ప్రధానంగా తీసిన ఈ సినిమా.. ట్రైలర్ బట్టి చూస్తుంటే ప్రేక్షకుల మనసు గెలుచుకునేలా కనిపిస్తుంది. మరి 'ఇడ్లీ కొట్టు'.. పోటీలో ఉన్న మిగతా సినిమాలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో?

(ఇదీ చదవండి: రీతూ బండారం బట్టబయలు.. పవన్ కెప్టెన్సీ ఫసక్)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)