Breaking News

ఓటీటీలోకి ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా

Published on Fri, 10/24/2025 - 12:33

పేరుకే తమిళ హీరో అయినప్పటికీ సార్, కుబేర లాంటి స్ట్రెయిట్ సినిమాలతో తెలుగులోనూ హిట్స్ కొట్టిన ధనుష్.. రీసెంట్‌గా హీరోగా నటిస్తూ దర్శకనిర్మాతగా ఓ మూవీ చేశాడు. అదే 'ఇడ్లీ కడై'. తెలుగులోనూ దీన్ని ఇడ్లీ కొట్టు పేరుతో థియేటర్లలో రిలీజ్ చేశారు. ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.

అక్టోబరు 01న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో రిలీజైంది. అయితే దీనికి ఒకరోజు తర్వాత 'కాంతార-1' రిలీజైంది. ఈ మూవీకి హిట్ టాక్ రావడంతో ఇడ్లీ కొట్టు చిత్రం తెలుగులో ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయింది. అదే టైంలో తమిళంలో మాత్రం మంచి వసూళ్లు వచ్చాయి. హిట్ అయింది. ఇప్పుడీ చిత్రం థియేటర్లలోకి వచ్చిన నెలలోపే అంటే అక్టోబరు 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

(ఇదీ చదవండి: కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన.. చిరంజీవి ఆశ నెరవేరేనా?)

'ఇడ్లీ కొట్టు' విషయానికొస్తే.. శంకరాపురం అనే ఊరిలో శివకేశవ(రాజ్ కిరణ్) ఓ ఇడ్లీ కొట్టు నడుపతుంటాడు. ఈ షాపులోని ఇడ్లీ.. చుట్టుపక్కలా చాలా ఫేమస్. ఇతడి కొడుకు మురళి(ధనుష్) మాత్రం తండ్రిలా ఊరిలో ఉండటం తన వల్ల కాదని, హొటల్ మేనేజ్‌మెంట్ చదువుతాడు. జాబ్ కోసం కుటుంబాన్ని వదిలిపెట్టి బ్యాంకాక్ వెళ్లిపోతాడు. 

కొన్నాళ్ల తర్వాత పనిచేస్తున్న కంపెనీ ఓనర్ విష్ణువర్ధన్ (సత్యరాజ్) కూతురు మీరా (షాలినీ పాండే)తోనే పెళ్లికి మురళి రెడీ అవుతాడు. సరిగ్గా పెళ్లికి రెండు మూడు రోజులు ఉందనగా శివకేశవ చనిపోతాడు. దీంతో మురళి.. సొంతూరికి వస్తాడు. తర్వాత ఏమైంది? విష్ణువర్ధన్ కొడుకు అశ్విన్(అరుణ్ విజయ్)తో మురళికి గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)